Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ ప్రాంతంలో ఎంత..!

Petrol-Diesel Price Today: దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడుతున్నాయి. చమురు ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు..

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ ప్రాంతంలో ఎంత..!
Fuel Price
Follow us
Subhash Goud

|

Updated on: Jul 26, 2022 | 8:49 AM

Petrol-Diesel Price Today: దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడుతున్నాయి. చమురు ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక చమురు మార్కెటింగ్ కంపెనీలు జూలై 26 మంగళవారం పెట్రోల్‌, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేక నేటికి 65 రోజులు పూర్తయ్యాయి. అంటే 65 రోజుల పాటు చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.62 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.35 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.28 ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.63 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.24 ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్ ధర రూ.97.82 ఉంది.

ప్రస్తుతం దేశంలో చమురు ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత, దేశంలో చాలా చోట్ల పెట్రోల్ లీటరుకు రూ.100 స్థాయిని దాటింది. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల ధరలు అంతకు మించి ఉన్నాయి.

SMS ద్వారా తనిఖీ చేయండి:

ఇవి కూడా చదవండి

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి పంపవచ్చు, HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు. మీ ఏరియా కోడ్‌ను తెలుసుకోవాలంటే ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..