Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Ertiga: మారుతి వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌ న్యూస్‌.. ఎర్టిగాలో రెండు కొత్త ఫీచర్స్‌.. ధర మరింత పెంపు..!

Maruti Ertiga: ప్రముఖ వాహనాల తయరీ దిగ్గజం మారుతి సుజుకీ వాహన రంగంలో దూసుకుపోతోంది. ఈ కంపెనీలో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వాహనాలను..

Maruti Ertiga: మారుతి వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌ న్యూస్‌.. ఎర్టిగాలో రెండు కొత్త ఫీచర్స్‌.. ధర మరింత పెంపు..!
Maruti Ertiga
Follow us
Subhash Goud

|

Updated on: Jul 25, 2022 | 1:10 PM

Maruti Ertiga: ప్రముఖ వాహనాల తయరీ దిగ్గజం మారుతి సుజుకీ వాహన రంగంలో దూసుకుపోతోంది. ఈ కంపెనీలో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వాహనాలను తయారు చేస్తుంటుంది. ఇక మారుతి కారు అభిమానులకు రెండు గుడ్‌న్యూస్‌లు.. ఒక బ్యాడ్‌ న్యూస్‌ఉంది. ఇక మారుతి ఎర్టిగాను రెండు కొత్త ఉపయోగకరమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఫీచర్లు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే కంపెనీ కారు ధరను కాస్త పెంచేసింది. దీని కారణంగా ఇప్పుడు వినియోగదారులు రూ. 6000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

అన్ని ఎర్టిగా వేరియంట్లలో ఇప్పుడు ‘ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్’ (ESP), ‘మౌంటైన్ గ్రిప్’ ఫీచర్లు అందుబాటులోకి రానున్నట్లు మారుతి సుజుకి ఇండియా గత రెండు రోజుల కిందట వెల్లడించింది. కంపెనీ ఇంతకుముందు ఈ ఫీచర్లను ఆటోమేటిక్, టాప్-ఎండ్ మోడళ్లలో మాత్రమే అందించేంది. ఎర్టిగా అన్ని వేరియంట్‌లు ఇప్పుడు ESP, మౌంటెన్ గ్రిప్ ఫీచర్‌తో అమర్చబడి ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇప్పుడు దీని ధర రూ. 8.41 లక్షలు (ఢిల్లీ-ఎక్స్‌షోరూమ్‌)గా ఉంటుందని మారుతి సుజుకీ కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి ఎర్టిగా 2022 అనేక మార్పులతో ఈ సంవత్సరం ప్రారంభంలో అధికారికంగా ప్రారంభించబడింది. మారుతి ఎర్టిగా టాప్-ఆఫ్-లైన్ ZXi వేరియంట్‌లో CNGని అందించడం ఇదే మొదటిసారి. MPV నాలుగు ట్రిమ్‌లు 11 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. VXi, ZXi, ZXi+లో మూడు ఆటోమేటిక్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. CNG కూడా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మారుతి ఎర్టిగా ఇంజన్

ఎర్టిగా మునుపటి కంటే మెరుగైన K-సిరీస్ 1.5-లీటర్ డ్యూయల్ VVT ఇంజన్‌ని పొందుతుంది. ఎమ్‌పివిలో లభించే మైలేజీని మరింత పెంచేందుకు కంపెనీ దీనిని రూపొందించింది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. మునుపటి వేరియంట్‌ 4-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ 6-స్పీడ్ యూనిట్ ద్వారా భర్తీ చేయబడింది. ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా మోడల్‌లో అందుబాటులో ఉన్నాయి. 2013లో ప్రారంభించిన మారుతి సుజుకీ ఎర్టిగా ఇప్పుడు 60 లీటర్‌ ట్యాక్‌ కెపాసితో సీఎన్‌జీ వెర్షన్‌తో వస్తుంది. 2022లో మారుతి సుజుకి ఎర్టిగా CNG కొత్త క్రోమ్డ్‌ గ్రిల్‌తో వస్తుంది. ఇది కాకుండా ఎర్టిగా ఫాగ్‌ ల్యాంప్స్‌ కూడా ఉంది. ఇది కొత్త అల్లాయ్‌ వీల్స్‌తో ఉంటుంది. అప్‌డేట్‌ వెర్షన్‌లో సాధారణ సమాచారంతో పాటు CNG స్థాయిని, అలాగే CNG టూ ఇంధన నిష్పత్తిని చూపించేలా కలర్‌ TFT MID స్క్రీన్‌ ఉన్నాయి. రెండు ఫీచర్స్‌తో ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది మారుతి కంపెనీ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..