AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medicine Price: క్యాన్సర్, మధుమేహ రోగులకు శుభవార్త.. ఈ మందులు మరింత చౌకగా..!

Medicine Price: మందుల ధర: సాధారణ, తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే అవసరమైన మందుల ధరలను తగ్గించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది..

Medicine Price: క్యాన్సర్, మధుమేహ రోగులకు శుభవార్త.. ఈ మందులు మరింత చౌకగా..!
Medicine Price
Subhash Goud
|

Updated on: Jul 25, 2022 | 3:29 PM

Share

Medicine Price: మందుల ధర: సాధారణ, తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే అవసరమైన మందుల ధరలను తగ్గించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని అధికారిక ప్రకటన ఆగస్ట్ 15న వెలువడవచ్చు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆ శాఖతో చర్చించి, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులు రాబోయే రోజుల్లో ఉపశమనం పొందవచ్చు. ఈ వ్యాధులకు సంబంధించిన కొన్ని మందుల ధర చాలా ఎక్కువ. దీంతో ప్రభుత్వం వాటి ధరలను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

జూలై 26న ఫార్మాస్యూటికల్‌ కంపెనీల ప్రతినిధులతో ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థ NPPA 355 ఔషధాల ధరపై పరిమితిని విధించింది. ఈ మందులు NLEM లో చేర్చబడ్డాయి. ఈ మందులపై వాణిజ్య మార్జిన్ హోల్‌సేల్‌కు 8 శాతం, రిటైలర్‌లకు 16 శాతం.

70 శాతం మేర తగ్గనున్నాయ్‌..

ఇవి కూడా చదవండి

ఈ ప్రభుత్వ ప్రతిపాదన అమలైతే ఈ మందుల ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయి. ఆ శాఖ జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో మార్పులు చేస్తోంది. ఇది 2015లో మార్చబడింది. ఇందులో రోగులు ఎక్కువ కాలం వాడే ఔషధాల అధిక మార్జిన్‌పై పరిమితి విధించాలని ఆలోచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి