Ration Card: మీరు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా..? వచ్చిందా..? లేదా తెలుసుకోవడం ఎలా..?

Ration Card: మీకు ఆధార్ కార్డు ఉంది కానీ రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంకా అందలేదు. అటువంటి పరిస్థితిలో మీరు రేషన్ కార్డు స్థితిని తనిఖీ..

Ration Card: మీరు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా..? వచ్చిందా..? లేదా తెలుసుకోవడం ఎలా..?
Ration Card
Follow us

|

Updated on: Jul 24, 2022 | 7:32 PM

Ration Card: మీకు ఆధార్ కార్డు ఉంది కానీ రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంకా అందలేదు. అటువంటి పరిస్థితిలో మీరు రేషన్ కార్డు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. రేషన్ కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇందు కోసం మీరు మీ సేవ కేంద్రం, ఇతర ఇంటర్నేట్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మీ మొబైల్‌లో చెక్‌ చేసుకోవచ్చు. రేషన్‌ కార్డుకు సంబంధిచి వివరాలు రేషన్‌ కార్డు మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (RCMS)లో తనిఖీ చేసుకోవచ్చు. RCMSలో మీరు రేషన్ కార్డు రకం, కార్డు ఎవరి పేరుతో ఉంది..? ఎంత మంది సభ్యులున్నారు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఏ రేషన్‌ దుకాణం నుంచి సరుకులు తీసుకుంటున్నారన్న విషయం తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు RCMS వెబ్ పోర్టల్‌కి వెళ్లాల్సి ఉంటుంది.

రేషన్ కార్డును ఎలా తనిఖీ చేయాలి:

☛ ముందగా గూగుల్‌లో RCMS అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. rcms అని టైప్ చేసి, ఆపై మీ రాష్ట్రం పేరును టైప్ చేయండి.

ఇవి కూడా చదవండి

☛ తర్వాత కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో రేషన్ కార్డుపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ‘నో యువర్ రేషన్ కార్డ్’పై క్లిక్ చేయండి.

☛ అందులో కనిపించే స్క్రీన్‌పై క్యాప్చా కోడ్ నమోదు చేయండి. తర్వాత మీ రేషన్‌ కార్డు నంబర్‌ను నమోదు చేయండి. ఖాళీ స్థలంలో కోడ్‌ను నమోదు చేసిన తర్వాత, వెరిఫైపై క్లిక్ చేయండి.

☛ తదుపరి దశలో మీరు ఆధార్ నంబర్ నమోదు ఉంటుంది. తర్వాత వ్యూ రిపోర్ట్ ఎంపికను ఎంచుకోండి. దీంతో మీ రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు రేషన్ కార్డ్ హోల్డర్ పేరు, రేషన్ కార్డ్ రకం, రేషన్ కార్డ్ నంబర్, రేషన్ షాప్ పేరు, సభ్యులందరి పేరు మొదలైన అన్ని వివరాలు కనిపిస్తాయి.

ఇలాగే కాకుండా మరో విధంగా కూడా తనిఖీ చేసుకోవచ్చు.

☛ ముందుగా మీ రాష్ట్రానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను తెరవండి. ఉదాహరణకు, మీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారైతే, epds.andhraprdesh.gov.in అని టైప్ చేయడం ద్వారా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ అవుతుంది.

☛ ఈ వెబ్‌సైట్‌లో అడిగే వివరాలను నమోదు చేయాలి

☛ ఇక స్క్రీన్‌పై వివిధ జిల్లాల పేర్లు కనిపిస్తాయి.

☛ మీరు అర్బన్, రూరల్ ఎంపిక చేసుకోవాలి.

☛ దీని తర్వాత గ్రామ పంచాయతీ పేరును ఎంచుకోండి.

☛ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల జాబితా తెరుచుకుంటుంది. అందులో మీ గ్రామం పేరును ఎంచుకోండి.

☛ మీ గ్రామంలోని రేషన్ కార్డుదారులందరి జాబితా కనిపిస్తుంది. మీ కార్డ్ నంబర్‌ని తనిఖీ చేసి, దానిపై క్లిక్ చేయండి.

☛ క్లిక్ చేయగానే మీ రేషన్ కార్డ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. మీ రేషన్ కార్డును ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.

(నోట్‌: మీ రాష్ట్రంలో రేషన్‌ కార్డు కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించినట్లయితే మీకు ఈ వివరాలు కనిపిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎలాంటి దరఖాస్తులకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. అలాంటి రాష్ట్రాల రేషన్‌ కార్డు వివరాలు అందుబాటులో ఉండవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు