Fake Aadhar Card: నకిలీ ఆధార్‌ కార్డులున్న వారిపై కేంద్రం చర్యలు.. 6 లక్షల కార్డులు రద్దు

Fake Aadhar Card: నేటి కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైనదిగా మారింది. భారతదేశంలో ఏదైనా ఆర్థిక లేదా ప్రభుత్వ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ప్రతిచోటా..

Fake Aadhar Card: నకిలీ ఆధార్‌ కార్డులున్న వారిపై కేంద్రం చర్యలు.. 6 లక్షల కార్డులు రద్దు
Aadhaar Card
Follow us

|

Updated on: Jul 24, 2022 | 7:51 PM

Fake Aadhar Card: నేటి కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైనదిగా మారింది. భారతదేశంలో ఏదైనా ఆర్థిక లేదా ప్రభుత్వ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ప్రతిచోటా ఆధార్ కార్డ్ ఎంతో అవసరం. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు పిల్లల స్కూల్, కాలేజీ అడ్మిషన్ నుండి ప్రయాణం వరకు ప్రతిచోటా ఇది ID ప్రూఫ్‌గా ఉపయోగించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది నకిలీ ఆధార్ కార్డును తయారు చేస్తున్నారు. ఆధార్ జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నకిలీ ఆధార్ కార్డులను కలిగి ఉన్న వారిపై చర్య చేపడుతోంది. యూఐడీఏఐ దాదాపు 6 లక్షల నకిలీ ఆధార్ కార్డులను రద్దు చేసింది. పార్లమెంటులో నకిలీ ఆధార్ కార్డుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయంపై సభలో వెల్లడించారు. దీనితో పాటు, ఆధార్ కార్డు దరఖాస్తును నిలిపివేసేందుకు UIDAI అనేక కొత్త చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

నకిలీ ఆధార్‌ కార్డులను తనిఖీ చేయడానికి బయోమెట్రిక్ మ్యాచింగ్ కొత్త పద్ధతిని తీసుకువచ్చినట్లు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ ఆధార్‌ కార్డులను గుర్తించి రద్దు చేస్తున్నామన్నారు. నకిలీ ఆధార్‌ కార్డులను జారీ చేసే నకిలీ వెబ్‌సైట్లను కూడా గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని డూప్లికేట్ ఆధార్ కార్డ్ తయారీ సైట్‌లను బ్లాక్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. నకిలీ ఆధార్‌ కార్డులను తయారు చేసే వెబ్‌సైట్లపై ఈ ఏడాది జనవరిలోనే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 11 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..