7th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పనుందా..? మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?

7th Pay Commission: 7వ వేతన సంఘం వార్తలు: పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ప్రభుత్వం త్వరలో కేంద్ర ఉద్యోగులకు పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ (DA) అందజేయనున్నట్లు తెలుస్తోంది..

7th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పనుందా..? మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?
7th Pay Commission
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2022 | 6:44 PM

7th Pay Commission: 7వ వేతన సంఘం వార్తలు: పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ప్రభుత్వం త్వరలో కేంద్ర ఉద్యోగులకు పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ (DA) అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 3న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏను 5 నుంచి 6 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులు డీఏ ప్రయోజనం పొందవచ్చు. ఇంతకుముందు ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను సుమారు 5 శాతం పెంచవచ్చని భావించారు. అయితే అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ పెరుగుదల 5 శాతానికి బదులుగా 6 శాతం ఉండే అవకాశం ఉంది. బకాయిలపై ఉద్యోగులు, పెన్షనర్లు మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరగా తమ బకాయిలు చెల్లించాలని అభ్యర్థించారు.

ప్రభుత్వం ఈ పెంపును ఆమోదించినట్లయితే అప్పుడు కేంద్ర ఉద్యోగులు, పెన్షన్లు మంచి ప్రయోజనం పొందుతారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను దాదాపు 18 నెలలుగా పెండింగ్‌లో ఉంది. అ నేపథ్యంలో ఆగస్టు 3న జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 34 శాతం డీఏ ఇస్తోంది. 2021 నుంచి ప్రభుత్వం డీఏను మొత్తం 11 శాతం పెంచింది. మార్చి 2022లో 31 శాతం నుండి 34 శాతానికి పెంచింది. ఇప్పుడు 5 శాతం పెంచితే డీఏ 39 శాతానికి చేరుకుంటుంది. ఈ ప్రయోజనం 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు చేకూరనుంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేటు

ఇవి కూడా చదవండి

రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా.. జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు DA, DRలను సవరిస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ అంచనాల కంటే ఎక్కువగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ స్థాయి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా 7 శాతం పైన ఉండగా, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 15 శాతం కంటే ఎక్కువగానే ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి