Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice, Train Food Price: బియ్యం ధరలు పెరుగుతాయి.. రైల్లో భోజనం మరింత కాస్ట్లీ..!

Rice, Train Food Price: పెరుగుతున్న వంటనూనెల ధరల నుంచి ఇటీవల దేశంలో సామాన్యులకు కొంత ఊరట లభించింది. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయల ధరలు కూడా తగ్గుముఖం..

Rice, Train Food Price: బియ్యం ధరలు పెరుగుతాయి.. రైల్లో భోజనం మరింత కాస్ట్లీ..!
Rice And Trin Food Price
Follow us
Subhash Goud

|

Updated on: Jul 21, 2022 | 5:09 PM

Rice, Train Food Price: పెరుగుతున్న వంటనూనెల ధరల నుంచి ఇటీవల దేశంలో సామాన్యులకు కొంత ఊరట లభించింది. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతున్న దాని ప్రకారం.. గత నెలలో టమోటా కిలోకు 15 రూపాయలు తగ్గింది. కాగా, గత ఏడాది కాలంలో ఉల్లి కిలోకు 3 రూపాయలు స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం టమాటా కిలో సగటు ధర 15 నుంచి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. కాగా, కిలో ఉల్లి సగటు ధర 20 నుంచి 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. డిసెంబర్ వరకు ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు తగినంత బఫర్ స్టాక్ ఉందని ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. గత ఏడాది కాలంగా అధిక కూరగాయల ధరలతో పోరాడుతున్న వినియోగదారులకు ఇది కాస్త ఉపశమనం కలిగించనుంది.

గత నెలలో బియ్యం ధరలు 10% పెరిగాయి:

ఒకవైపు టమాటా, ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా మరో ప్రధాన ఆహారం బియ్యం ధరలు పెరగడం ప్రారంభించాయి. గత నెలలో దేశవ్యాప్తంగా బియ్యం ధరలు 10% పెరిగాయి. అంతేకాదు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, యుపీ, బీహార్‌లలో దీని ధరను పరిశీలిస్తే అది 20% పెరిగింది. జూన్ 22 నుంచి బంగ్లాదేశ్ మన నుంచి ఎక్కువ బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నందున బియ్యం ధర ఆలస్యంగా పెరిగింది. గోధుమలపై మాదిరిగానే బియ్యంపై కూడా భారతదేశం ఎగుమతి నిషేధాన్ని విధించవచ్చని బంగ్లాదేశ్ భయపడుతోంది. బియ్యం ఎగుమతిదారులు బంగ్లాదేశ్‌లో దేశీయ మార్కెట్‌లో పొందే దానికంటే మెరుగైన డీల్‌ను పొందుతున్నారు. దీంతో దేశీయ మార్కెట్లలో బియ్యానికి కృత్రిమ కొరత ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

రైలు భోజనం మరింత కాస్లీ:

ఇక రైళ్లలో భోజనం మరింత కాస్లీ కానుంది. మీరు రైలులో ప్రయాణించే ముందు టికెట్‌తో పాటు మీ భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేల రైలు ఎక్కిన తర్వాత ఆర్డర్ చేయాలనుకుంటే మీరు భోజనం కోసం అదనంగా రూ. 50 చెల్లించాల్సి రావచ్చు. అయితే టీ ఆర్డర్ చేస్తే కేవలం రూ. 20 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒక కప్పు టీకి 50 రూపాయల సర్వీస్‌ చార్జీ విధించిన ఒక ప్రయాణికుడు బిల్లును అప్‌లోడ్ చేయడంపై పలు విమర్శలు రావడంతో IRCTC వివరణ ఇచ్చింది. కేవలం 20 రూపాయల MRP మాత్రమే టీ కోసం చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. కానీ, భోజనం ధర మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే, భోజనంపై 50 రూపాయల సర్వీస్ ఛార్జీని తొలగించిన తర్వాత, IRCTC, భోజన ధరలను సమానమైన మార్జిన్‌తో పెంచింది. ఫలితంగా కేవలం టీ మాత్రమే చౌకగా మారింది కానీ భోజనం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..