AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Free Bonds: ఇలా ఇన్వెస్ట్ చేస్తే టాక్స్ లేకుండా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ లాభం

Tax Free Bonds: బ్యాంకులో సేవింగ్స్ ఎకౌంట్స్ నుంచి వచ్చే వడ్డీ చాలా తక్కువ. రెపో రేటు పెరిగినప్పటికీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అంటే ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లు పెద్దగా పెరగలేదు. స్టాక్ మార్కెట్..

Tax Free Bonds: ఇలా ఇన్వెస్ట్ చేస్తే టాక్స్ లేకుండా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ లాభం
Tax Free Bonds
Subhash Goud
|

Updated on: Jul 19, 2022 | 3:53 PM

Share

Tax Free Bonds: బ్యాంకులో సేవింగ్స్ ఎకౌంట్స్ నుంచి వచ్చే వడ్డీ చాలా తక్కువ. రెపో రేటు పెరిగినప్పటికీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అంటే ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లు పెద్దగా పెరగలేదు. స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గుల కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా ఇన్వెస్టర్స్ వారిలోనూ ముఖ్యంగా అధిక జీతాలు ఉన్నవారు, టాక్స్ ఫ్రీ బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ టాక్స్ ఫ్రీ బాండ్‌లు అంటే ఏమిటి? వీటిపై మనం బ్యాంక్ FDల కంటే కూడా అధిక రాబడిని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

NHAI, PFC, REC వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు పన్ను రహిత బాండ్లు అంటే టాక్స్ ఫ్రీ బాండ్స్ ను జారీ చేస్తాయి. ఈ బాండ్ల ద్వారా సేకరించిన మూలధనం మౌలిక సదుపాయాలు, గృహ ప్రాజెక్టులకు నిధుల కోసం ఉపయోగిస్తారు. మార్కెట్ రిస్క్‌లకు దూరంగా ఉండాలనుకునే ఈ పెట్టుబడిదారులకు పన్ను రహిత బాండ్లు మంచి ఎంపిక. వీటిని మీ రిటైర్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో కూడా చేర్చవచ్చు. ఈ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వం 2012 నుంచి 2016 మధ్య ఈ బాండ్లను జారీ చేసింది.

గత 6 సంవత్సరాలలో కొత్త బాండ్లు జారీ చేయనందున పన్ను రహిత బాండ్ల సరఫరా పరిమితంగా ఉంది. పన్ను రహిత బాండ్ల వడ్డీ ఆదాయంపై ఎటువంటి టాక్స్ ఉండదు. పన్ను రహిత బాండ్లపై రాబడి ఏడాది క్రితం 4 – 4.5 శాతం నుంచి 5.5- 6 శాతానికి పెరిగింది. స్వల్పకాలిక బ్యాంకు FDలలో వడ్డీ రేటు 4.5 నుంచి 5 శాతం మాత్రమే. అందుకే సేవింగ్స్ ఎకౌంట్ లో డబ్బును ఉంచడం లేదా FDలలో పెట్టుబడి పెట్టడం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమంగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

అసలు, వడ్డీ మొత్తంలో ఏదైనా డిఫాల్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్నందున పన్ను రహిత బాండ్లలో పెట్టుబడి పెట్టడం తక్కువ ప్రమాదకరం. ప్రభుత్వ రంగ సంస్థల పన్ను రహిత బాండ్లకు AAA రేటింగ్ ఉంది. ఇది చాలా సురక్షితమైనదిగా పరిగణిస్తారు. పన్నురహిత బాండ్లు ఎక్కువ కాలం ఉంటాయి. ఈ బాండ్స్ 10 నుంచి 20 సంవత్సరాలలో మెచ్యూరిటీ చెందుతాయి.

పన్ను రహిత బాండ్లను డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల ద్వారా వర్తకం చేయవచ్చు. ప్రభుత్వ సంస్థలు సాధారణ ప్రజలకు ఈ బాండ్లను జారీ చేసినప్పుడు, దరఖాస్తును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. బాండ్లను జారీ చేసిన తర్వాత, వాటిని షేర్ల ట్రేడింగ్ మాదిరిగానే స్టాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మెచ్యూరిటీకి ముందు పన్ను రహిత బాండ్లను బ్రేక్ చేయడం సాధ్యం కాదు. కానీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఇతర పెట్టుబడిదారులకు విక్రయించవచ్చు. బాండ్ల ఈ ట్రేడింగ్‌పై మారాం స్పష్టంగా పన్ను విధిస్తారు.

30 శాతం కంటే ఎక్కువ పన్ను శ్లాబ్‌లో ఉన్నవారికి ఈ బాండ్లు ప్రయోజనకరంగా ఉన్నాయని వీఆర్ వెల్త్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు వివేక్ రేగే చెప్పారు. కానీ సెకండరీ బాండ్ మార్కెట్‌లో ఇవి అందుబాటులో ఉంటేనే మీరు పన్ను రహిత బాండ్లలో పెట్టుబడి పెట్టగలరు. ప్రభుత్వం 2012-16లో బాండ్లను జారీ చేసింది. ఆ తర్వాత ఎటువంటి బాండ్లను జారీ చేయలేదు. రాబోయే కాలంలో ప్రభుత్వం ఈ బాండ్లను జారీ చేస్తుందని ఊహించలేదు. ఈ బాండ్‌లు పెద్ద టిక్కెట్ సైజులలో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు 5 లక్షల రూపాయల వరకూ ఉంటాయి. ఈ బాండ్‌లను ఆ తర్వాత గుణకాలలో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ పై 5.5 శాతం టాక్స్ ఫ్రీ ఇన్ కం పొందుతున్నట్లయితే అది పెద్ద విషయంగానే చెప్పవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి