PF withdrawal rules 2022: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌! పీఎఫ్‌ విత్‌డ్రాపై ఆ నిబంధన ఎత్తివేత..

ప్రావిడెంట్ ఫండ్‌ (PF) విత్‌డ్రాల్‌ రూల్స్‌ మారుస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్పుల ప్రకారం.. ఇకపై ఈపీఎఫ్‌ఓ సభ్యులు మెడికల్ ఎమర్జెనీ సమయంలో పీఎఫ్‌లో కొంత భాగాన్ని..

PF withdrawal rules 2022: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌! పీఎఫ్‌ విత్‌డ్రాపై ఆ నిబంధన ఎత్తివేత..
Pf Withdrawal Rules
Follow us

|

Updated on: Jul 19, 2022 | 3:41 PM

PF Withdrawal Rules changed: ప్రావిడెంట్ ఫండ్‌ (PF) విత్‌డ్రాల్‌ రూల్స్‌ మారుస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్పుల ప్రకారం.. ఇకపై ఈపీఎఫ్‌ఓ సభ్యులు మెడికల్ ఎమర్జెనీ సమయంలో పీఎఫ్‌లో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు గత యేడాది నిబంధనలకు సవరణలు చేసి, అనుమతిస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. గతంలోనైతే హాస్పిటల్‌ ఎస్టిమేట్‌ బిల్‌ వచ్చిన తర్వాత మాత్రమే ఉపసంహరణలు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఐతే తాజా సవరనతో.. ఎటువంటి ఎస్టిమేట్‌ డాక్యుమెంట్లతో పనిలేకుండా ఈపీఎఫ్‌సీ సభ్యులు దాదాపు రూ.లక్ష వరకు మెడికల్ అడ్వాన్స్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి లభించినట్లైంది. ఐతే సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీం పరిధిలోని ఎంప్లాయిస్‌కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ప్రభుత్వ/ పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU)/ CGHS-ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో అడ్మిట్‌ అయిన ఉద్యోగులు పీఎఫ్ ఉపసంహరనకు అర్హులు.

మెడికల్ ఎమర్జెన్సీ కోసం పీఎఫ్‌ డబ్బు ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చంటే..

  • ముందుగా EPFO ​అధికారిక ​పోర్టల్ epfindia.gov.in ఓపెన్ చెయ్యాలి.
  • యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను నమోదు చేసి. తర్వాత కింద పేర్కొన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్‌ అవ్వాలి.
  • ఆన్‌లైన్ సర్వీసెస్‌ ట్యాబ్‌ను నావిగేట్ చేసి, ‘క్లెయిమ్’ ట్యాబ్‌పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ ఇచ్చిన టర్మ్‌, కండీషన్లను తరవుగా చదివిన తర్వాత మాత్రమే అంగీకారాన్ని తెలపాలి.
  • తర్వాత ‘ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్’పై క్లిక్ చేసి, విత్‌డ్రాల్‌ అప్లైయింగ్‌ ఆప్షన్ల నుంచి మెడికల్ ఎమర్జెన్సీపై క్లిక్‌ చెయ్యాలి.
  • వర్కింగ్‌ డే రోజున విత్‌డ్రాల్‌ అప్లికేషన్‌ సమర్పించినట్లయితే, మరుసటి రోజు ముగిసేలోపు పంపిణీ చేయబడుతుంది.
  • ఆతర్వాత EPFO ​సభ్యుల శాలరీ అకౌంట్‌ లేదా చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిలో విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • పేషెంట్‌ అప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లయితే, పీఎఫ్ ఉసంహరణ సౌకర్యాన్ని పొందేందుకు ఎప్లాయిస్‌ తప్పనిసరిగా 45 రోజుల్లోపు EPFOకి మెడికల్ బిల్లులను సమర్పించవల్సి ఉంటుంది.

రిటైర్‌మెంటుకు ముందే పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవాలంటే..

ఇవి కూడా చదవండి
  • ఇతర కారణాల వల్ల కూడా ఉద్యోగులు రిటైర్‌మెంటుకు ముందే తమ PFను ఆన్‌లైన్‌లో e-SEW పోర్టల్ నుంచి సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • PF ఖాతాకు డబ్బును డిపాజిట్ చేయడానికి ఆయా వ్యక్తుల ఆధార్ కార్డును యూనివర్సల్ ఖాతా సంఖ్య (UAN)తో తప్పనిసరిగా లింక్‌ చెయ్యాలి. ఇది EPFO ​వెబ్‌సైట్ నుంచి లేదా UMANG మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.
  • పీఎఫ్‌ ఉపసంహరించుకునే ముందు KYC ఫార్మాలిటీని పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మీరు PF డబ్బును ఉపసంహరించుకోవడానికి ఈ కారణాలను తెలుపవచ్చు:

  • గృహ నిర్మాణం, కొనుగోలు కోసం తీసుకోవచ్చు. అందుకు కనీసం 60 నెలల పాటు ఉద్యోగి సర్వీస్‌లో ఉండాలి.
  • ఉద్యోగి వివాహం లేదాపిల్లలు/తోబుట్టువుల వివాహం/పిల్లల చదువుల కోసం కూడా విత్‌ డ్రా చేసుకోవచ్చు. అందుకు ఉద్యోగి కనీసం 84 నెలల సర్వీస్ అవసరం.
  • అలాగే పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు మీ పీఎఫ్‌ అకౌంట్ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీ వయస్సు 54 ఏళ్లు పైన ఉండాలి.

ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..