- Telugu News Photo Gallery Kerala Jeweller Breaks Guinness Record For Designing Mushroom Shaped Ring With 24,000 Diamonds telugu trending news
బాప్ రే! ఈ ఉంగరంలో 24 వేలకు పైగా డైమండ్లున్నాయా? ఖరీదెంతో తెలుసా..
నెట్టింట వైరల్ అవుతోన్న ఈ డైమండ్ రింగ్ గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది. ఎందుకో తెలుసా! వేలికి తొడిగే ఈ రింగులో దాదాపు 24,689ల వజ్రాలు పొదిగున్నాయి మరి. దీనిని కేరళలోని ఓ డైమండ్ జ్యువెలరీ కంపెనీ తయారు చేసింది.ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి..
Updated on: Jul 19, 2022 | 1:42 PM

నెట్టింట వైరల్ అవుతోన్న ఈ డైమండ్ రింగ్ గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది. ఎందుకో తెలుసా! వేలికి తొడిగే ఈ రింగులో దాదాపు 24,689ల వజ్రాలు పొదిగున్నాయి మరి. దీనిని కేరళలోని ఓ డైమండ్ జ్యువెలరీ కంపెనీ తయారు చేసింది.ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి మైక్రోస్కోప్‌ను ఉపయోగించారట.

పుట్టగొడుగు ఆకారంలో ఉన్న ఈ ఉంగరానికి 'ది టచ్ ఆఫ్ అమీ' అని నామకరణం చేశారు. 3 నెలలు కష్టపడి తయారు చేసిన ఈ ఉంగరంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

ఈ ఉంగరాన్ని లిక్విడ్ గోల్డుతో 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. దీనిలో దాదాపు 41 రేకులున్నాయి.

భారత్‌లో తయారైన డైమండ్ రింగ్‌లలో ఇది ప్రత్యేకమైనది. ఈ ఉంగరానికి గిన్నీస్ రికార్డు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.

కేరళలోని మలప్పురంలోనున్న ఈ కంపెనీ గతంలో కూడా పలు అవార్డులను గెలుచుకుంది. ఈ కంపెనీ ఖాతాలో ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన నగల వ్యాపారి హర్షిత్ బన్సాల్ 12,638 వజ్రాలతో తయారు చేసిన ఉంగరం 2020తో మాత్రమే గిన్నిస్ రికార్డు ఉంది. తాజాగా ఈ ఉంగరం తయారు చేయడంలో ఆ రికార్డు బ్రేక్ చేసినట్లయ్యింది.





























