Income Tax Return: సమయానికి ITR ఫైల్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. పూర్తి వివరాలు

Income Tax Return: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ..

Income Tax Return: సమయానికి ITR ఫైల్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. పూర్తి వివరాలు
Income Tax Return
Follow us

|

Updated on: Jul 23, 2022 | 7:15 PM

Income Tax Return: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. మీ ఆదాయం పన్ను విధించదగిన పరిమితి కంటే తక్కువగా ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయడం ముఖ్యం కాదని చాలా మంది అనుకుంటారు. మొత్తం ఆదాయం మినహాయింపు పరిమితిని మించి ఉంటే ITR ఫైల్ చేయడం చాలా ముఖ్యమైనది. అయితే సమయానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయకుంటే భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పనులను ముందస్తుగా చేసుకుంటే ఎంతో మేలు లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే సమాయనికి ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు:

బ్యాంకు రుణం సౌలభ్యం: మీరు సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేశంలోని అన్ని బ్యాంకులు పన్ను రిటర్న్ కాపీ గురించి అడుగుతాయి. ITR సహాయంతో బ్యాంకుల్లో రుణాలు పొందడం సులభం అవుతుంది. గృహ రుణాలు, వాహనరుణాలు పొందడంలో సులభతరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

వీసా పొందడానికి.. వీసా దరఖాస్తు సమయంలో చాలా మంది ఎంబసీలు, కాన్సులేట్‌లు గత రెండేళ్లుగా ప్రయాణికుల ITR కాపీని సమర్పించాలని కోరుతున్నారు. డాక్యుమెంటేషన్ పూర్తి అయినట్లయితే ఇది అప్లికేషన్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

నష్టాలను తగ్గిస్తుంది: ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఐటీఆర్‌ ఫైల్‌ చేసేవారికి గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభంతో భర్తీ చేయవచ్చు. మీరు మీ ITR ను సకాలంలో ఫైల్ చేసినట్లయితేనే ఈ ప్రయోజనం పొందవచ్చు. IT చట్టం ప్రకారం.. మీరు మీ బకాయి ఖర్చులను వచ్చే సంవత్సరానికి కూడా ఐటీఆర్‌లో నమోదు చేసుకోవచ్చు.

జరిమానాలు నివారించడానికి.. ఐటీఆర్ సకాలంలో దాఖలు చేయకపోతే ఆ వ్యక్తిపై ఐదు వేల రూపాయల వరకు జరిమానా చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా, వ్యక్తి సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీపై బ్యాంకులు తగ్గించిన TDS తిరిగి పొందవచ్చు.

చిరునామా రుజువుగా.. ITR చిరునామా, ఆదాయ రుజువుగా కూడా ఉపయోగించవచ్చు. అలాగే సభ్యత్వం మొదలైన వాటి కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!