Best Companies: ఉద్యోగం చేయడానికి దేశంలో అత్యుత్తమ 10 కంపెనీలు ఇవే.. అత్యధిక జీతం.. ఉద్యోగ భద్రత
Best Companies: ఉద్యోగం కోసం దేశంలోని మంచి పేరున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కంపెనీలు ఉద్యోగం సంపాదిస్తే అధిక జీతంతో పాటు భద్రత, ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి..
Best Companies: ఉద్యోగం కోసం దేశంలోని మంచి పేరున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కంపెనీలు ఉద్యోగం సంపాదిస్తే అధిక జీతంతో పాటు భద్రత, ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. ఇక మైక్రోసాఫ్ట్ ఇండియా అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగం. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా దేశంలోనే అత్యంత ‘ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్’. గురువారం విడుదల చేసిన సర్వే ప్రకారం.. మెర్సిడెస్-బెంజ్ ఇండియా అత్యంత ఆకర్షణీయమైన కంపెనీల జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఇక అమెజాన్ ఇండియా మూడవ స్థానంలో ఉంది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్-2022 ప్రకారం.. మైక్రోసాఫ్ట్ ఇండియా ఫైనాన్షియల్ ఫ్రంట్, ఆకర్షణీయమైన జీతం, అందించే ప్రయోజనాల పరంగా అత్యధిక స్కోర్ సాధించింది. ఏదైనా సంస్థ లేదా కంపెనీ ఆకర్షణీయమైన బ్రాండ్‌గా మారడానికి ఇవి ముఖ్యమైన అంశాలు.
ఈ జాబితాలో మూడు టాటా కంపెనీలు ఉన్నాయి. 2022కి గానూ అత్యంత ఆకర్షణీయమైన కంపెనీల జాబితాలో హ్యూలెట్ ప్యాకర్డ్ నాల్గవ స్థానంలో, ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో, విప్రో ఆరో స్థానంలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏడో స్థానంలో, టాటా స్టీల్ ఎనిమిదో స్థానంలో, టాటా పవర్ కంపెనీ తొమ్మిదో స్థానంలో, శాంసంగ్ 10వ స్థానంలో నిలిచాయని సర్వే వెల్లడించింది.
అయితే ప్రపంచంలోని 5,944 కంపెనీలపై సర్వే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లోని 5,944 కంపెనీల్లోని 1,63,000 మంది వ్యక్తుల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. 18 నుంచి 65 ఏళ్ల లోపు వయస్సున్న వారిలో సాధారణ ప్రజల అభిప్రాయం సర్వేలో తెలిసింది. 10 మంది భారతీయ ఉద్యోగులలో తొమ్మిది మంది (88 శాతం) శిక్షణ, వ్యక్తిగత కెరీర్ వృద్ధిని అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..