SSC Recruitment: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

SSC Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనుంది. భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన...

SSC Recruitment: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
SSC
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 22, 2022 | 6:25 AM

SSC Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనుంది. భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్లు, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్లు, సీనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్లు పోస్టులను భర్తీ చేయనున్నారు.

* సెంట్రల్‌ సెక్రటేరియట్‌ అఫీషియల్‌ లాంగ్వేజ్‌ సర్వీస్‌, రైల్వే బోర్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పూర్తి ఖాళీల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను క‌ంప్యూట‌ర్ ఆధారిత టెస్ట్ (పేప‌ర్-1, పేప‌ర్-2) ఆధారంగా ఎంపిక చేస్తారు. పేపర్‌ 1లో కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, పేపర్‌ 2లోట్రాన్స్‌లేషన్‌, ఎస్సే రైటింగ్‌ ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 20-07-2022న మొదలవుతుండగా, దరఖాస్తులకు చివరి తేదీగా 04-08-2022ని నిర్ణయించారు.

* కంప్యూటర్ ఆధారిత పరీక్షను అక్టోబర్‌ నెలలో నిర్వహించనున్నారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..