NABARD Recruitment: నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
NABARD Recruitment: నాబార్డ్ (NABARD) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) ఖాళీలను భర్తీ చేయనున్నారు...

NABARD Recruitment: నాబార్డ్ (NABARD) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 170 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ (ఆర్‌డీబీఎస్) – 161, అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ (రాజ్‌భాష సర్వీస్)-07, అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్) – 02 ఖాళీలు ఉన్నాయి.



* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 28,150 నుంచి రూ. 55,600 వరకు చెల్లిస్తారు.
* జనరల్ అభ్యర్థులు రూ. 800, ఎస్‌సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్ వారు రూ. 150 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నాబార్డ్ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ 18-07-2022న మొదలై 07-08-2022 తేదీతో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..