Telangana Jobs 2022: ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,90,000ల జీతం..

తెలంగాణ రాష్ట్ర పరిధిలోనున్న ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (RIMS Adilabad).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ (Teaching Posts) పోస్టుల భర్తీకి..

Telangana Jobs 2022: ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,90,000ల జీతం..
Rims Adilabad
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 20, 2022 | 10:19 AM

RIMS Adilabad Professor Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర పరిధిలోనున్న ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (RIMS Adilabad).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ (Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 56

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీఏఎల్‌- ఆర్‌ఎంవో, సీఎంవో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

విభాగాలు: ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, టీబీసీడీ, ఫిజియాట్రి, అనాటమా, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియా, సైకియాట్రీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 65 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: పోస్టునుబట్టి రూ.40,270ల నుంచి రూ.1,90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో స్పెషలైజేషన్‌లో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూ తేదీ: జులై 23, 2022.

అడ్రస్‌: RIMS, Medical College, General Hospital and Super Specialty Hospital of Rajiv Gandhi Institute of Medical Sciences, Adilabad.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.