- Telugu News Photo Gallery RBI imposes restrictions on Raigad Sahakari Bank, caps customer withdrawals
RBI: నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు
RBI: కోఆపరేటివ్ బ్యాంకుల్లో డబ్బు ఉంచుకోవడానికి ప్రజలను మరింత నిరుత్సాహపరుస్తుంది. అలాంటి బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలు పాటించకుంటే చర్యలు చేపడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
Updated on: Jul 19, 2022 | 8:15 PM

RBI: కోఆపరేటివ్ బ్యాంకుల్లో డబ్బు ఉంచుకోవడానికి ప్రజలను మరింత నిరుత్సాహపరుస్తుంది. అలాంటి బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలు పాటించకుంటే చర్యలు చేపడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు చేపడుతోంది.

రూల్స్ పాటించని బ్యాంకులకు భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. ఇప్పటికే దేశంలో చాలా బ్యాంకులపై కొరఢా ఝులిపించింది. భారీగా జరిమానా విధించడమే కాకుండా వినియోగదారుల లావాదేవీలపై ఆంక్షలు విధిస్తోంది.

ఇక తాజాగా రాయ్‌ఘడ్ సహకరి బ్యాంక్ నుంచి వచ్చే ఆరు నెలల పాటు విత్‌డ్రాలను రూ.15,000కి పరిమితం చేసింది. అంతేకాకుండా ఖాతాదారులు ఈ సమయంలో రుణాల కోసం దరఖాస్తు చేయలేరు.

ఆరు నెలల తర్వాత ఖాతాదారులు ఈ బ్యాంకులో తమ పొదుపు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకింగ్ నిబంధనలను పాటించని కొన్ని సహకార బ్యాంకులపై గత రెండు నెలల్లో ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.





























