Onion Rate: మరింత చౌకగా మారనున్న ఉల్లి ధర.. రికార్డ్‌ స్థాయిలో బఫర్‌ స్టాక్‌..!

Onion Rate: ఇటీవల ఉల్లి ధరలు మండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత ఏడాది కంటే ఇప్పుడు ఉల్లి ధర దాదాపు 9 శాతం తక్కువగా ఉంది. ప్రభుత్వం..

Onion Rate: మరింత చౌకగా మారనున్న ఉల్లి ధర.. రికార్డ్‌ స్థాయిలో బఫర్‌ స్టాక్‌..!
Onion Rate
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2022 | 9:51 PM

Onion Rate: ఇటీవల ఉల్లి ధరలు మండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత ఏడాది కంటే ఇప్పుడు ఉల్లి ధర దాదాపు 9 శాతం తక్కువగా ఉంది. ప్రభుత్వం ఉల్లి ధర పెరగకుండా చర్యలు చేపడుతోంది. వచ్చే నెల నుండి దేశంలోని మండీలలో కేంద్ర ప్రభుత్వం తన బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయలను సరఫరా చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో మండీలలోని బఫర్ స్టాక్ నుండి ఆగస్టు నెల నుండి సరఫరా ప్రారంభమై ఈ ఏడాది చివరి వరకు కొనసాగుతుందని తెలిపారు.

2.50 లక్షల టన్నుల ఉల్లి

ఉల్లి ధరను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో బఫర్ స్టాక్‌ను సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2.50 లక్షల టన్నుల ఉల్లిపాయల బఫర్ స్టాక్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈసారి ప్రభుత్వం ఉల్లి కొనుగోళ్లు కూడా రికార్డు స్థాయిలో చేయడంతో దేశంలో ఉల్లి ఉత్పత్తి భారీగా పెరిగింది. దేశంలో టమాటా ధరలు నెలలో మూడింట ఒక వంతు తగ్గాయి. గత ఏడాది కంటే ఉల్లి ధరలు 9 శాతం తగ్గాయి. దేశవ్యాప్తంగా ఉల్లి సగటు ధర కిలో రూ.25.78కి తగ్గింది. ఇది గతేడాది కంటే 9 శాతం తక్కువ.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి