Royal Enfield: బుల్లెట్ బాబులకు బంపర్ న్యూస్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అదిరిపోయే ఫీచర్స్ ఇవే..

ఆగస్ట్ 7 న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మార్కెట్‌లో విడుదల కానుంది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించిన లుక్, డిజైన్, ఫీచర్స్ ఏవీ కూడా కంపెనీ విడుదల చేయలేదు. Royal Enfield కంపెనీ మార్కెటింగ్‌లో భాగంగా..

Royal Enfield: బుల్లెట్ బాబులకు బంపర్ న్యూస్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అదిరిపోయే ఫీచర్స్ ఇవే..
Royal Enfield
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2022 | 5:05 PM

Royal Enfield Hunter 350: బుల్లెట్ వాహనం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. కుర్రాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ బుల్లెట్ బండ్లను కొనాలని కలలుకంటుంటారు. అలాంటి వారికోసం మరో సరికొత్త ఫీచర్స్‌తో మరో బైక్ అందుబాటులోకి రానుంది. ఆగస్ట్ 7 న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మార్కెట్‌లో విడుదల కానుంది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించిన లుక్, డిజైన్, ఫీచర్స్ ఏవీ కూడా కంపెనీ విడుదల చేయలేదు. Royal Enfield కంపెనీ మార్కెటింగ్‌లో భాగంగా.. భారతదేశంలోని తన డీలర్‌షిప్‌లకు బైక్‌ను పంపడం ప్రారంభించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ఈ బైక్ అత్యంత సరసమైన ధరకు ఆఫర్‌లో వస్తుందని పేర్కొంటున్నారు. ఈ బైక్ డిజైన్ వివరాలు ఏవీ విడుదల కానప్పటికీ.. దీనికి సంబంధించిన విషయాలను పలు షోరూంలు వెల్లడిస్తుండటం రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌పై మరింత ఆసక్తి కలిగిస్తోంది.

హంటర్ 350 గత రెండు సంవత్సరాలలో చాలాసార్లు పలు విషయాలు వెల్లడైనప్పటికీ.. బైక్ చివరి వెర్షన్‌ను రివీల్ చేయకపోవడం ఇదే మొదటిసారి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 తాజా చిత్రాల ప్రకారం.. బైక్ రెండు రంగులలో వస్తుంది. సింగిల్-టోన్ సిల్వర్ షేడ్, డ్యూయల్-టోన్ బ్లూ అండ్ వైట్ పెయింట్ స్కీమ్.. రంగుల్లో అందుబాటులోకి రానుంది. బైక్ సింగిల్-పీస్ సీటు, షార్ట్ అండ్ స్టబ్బీ ఎగ్జాస్ట్, టెన్-స్పోక్ అల్లాయ్‌లు లేదా స్పోక్ వీల్స్‌తో కూడిన కాంపాక్ట్ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది.

హంటర్ 350 తాజా ఫోటోలు గుండ్రని ఆకారపు హెడ్‌ల్యాంప్, ఫోర్క్ కవర్ గైటర్‌లు, ఆఫ్‌సెట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉన్నట్లు చూపుతున్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 350, స్క్రామ్ 411 లాగా కనిపిస్తుంది. ఇది ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌తో కలిసి ఉన్నట్లు కనిపించడం లేదని ఆటోకార్ ఇండియా నివేదించింది. బైక్ స్విచ్ గేర్, గ్రిప్‌లు కూడా మెటోర్ మాదిరిగానే కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వివరాలను, స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే దాని హోమోలోగేషన్ పత్రం ఈ బైక్‌కు మెటోర్ 350 వలె అదే ఇంజన్ ఉంటుందని వెల్లడించింది. అంటే హంటర్ 350 349cc, సింగిల్- సిలిండర్, ఏయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ ఉంటుందని అర్ధమవుతోంది. ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో ఇంజిన్ 20 bhp, 27 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉండనుంది.

హంటర్ 350 ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో సింగిల్/డ్యూయల్-ఛానల్ ABSతో పాటు డిస్క్/డ్రమ్ యూనిట్‌ ఉండవచ్చని పేర్కొంటున్నారు. ప్రారంభించిన తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 TVS రోనిన్, హోండా H’ness CB350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న హంటర్ 350 బైక్ దేశంలో చౌకైన ధరకు లభిస్తుందని అంచనా. దీని ధర రూ. 1.5 – 1.7 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని పేర్కొంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి