Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మీసాలు మగాళ్లకేనా.. నేనూ మెలేస్తానంటున్న కేరళ మహిళ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..

రళకు చెందిన ఓ మహిళ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అచ్చం మగాళ్ల లాగా మీసాలను మెలితిప్పి.. నా ఇష్టం అని పేర్కొంటుంది. అయితే.. ఆమెను నెటిజన్లు చాలామంది ప్రశంసిస్తుండగా..

Viral News: మీసాలు మగాళ్లకేనా.. నేనూ మెలేస్తానంటున్న కేరళ మహిళ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..
Shaija Flaunts Moustache
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2022 | 1:10 PM

Kerala woman flaunts moustache: మీసాలు మగాళ్లు మాత్రమే తిప్పుతారా..? వాళ్లకేం తక్కువ కానంటూ ఓ మహిళ మీసాలను మేలేసి మరి తిప్పుతోంది. నా మీసాలు.. నా ఇష్టం.. ఇందులో వేరొకరి ప్రమేయం అవసరం లేదంటూ తెగేసి మరి చెబుతోంది ఆ మగువ.. కేరళకు చెందిన ఓ మహిళ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అచ్చం మగాళ్ల లాగా మీసాలను మెలితిప్పి.. నా ఇష్టం అని పేర్కొంటుంది. అయితే.. ఆమెను నెటిజన్లు చాలామంది ప్రశంసిస్తుండగా.. మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె చెప్పిన మాటాలు విని అందరూ సెల్యూట్ చేస్తున్నారు. సాధారణంగా కొంతమంది యువతుల ముఖం మీద, గడ్డం మీద వెంట్రుకలు పెరుగుతాయి. వాటిని తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీరికి భిన్నంగా.. కేరళ మహిళ షైజా తన మూతి మీద పెరిగిన మీసాలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటోంది.

కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల షైజా తన మీసాల కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారాన్ని కొందరు వ్యతిరేకించగా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలవడంతోపాటు ప్రశంసిస్తున్నారు. దీని గురించి షైజా మాట్లాడుతూ.. తాను మీసాలను పెంచుకోవాలనుకుంటున్నానని, వాటిని తీసివేయడం అస్సలు ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఈ మీసం తనకు గర్వకారణమని పేర్కొంది. ‘‘మీసం గురించి నన్ను ఎగతాళి చేస్తారు.. పురుషులకు మీసాలు ఉంటాయి.. మహిళకు మీసాలు ఎందుకు ఉంటాయంటూ ప్రశ్నిస్తారు.. నాకు నచ్చింది.. నేను మీసం ఉంచుకున్నా.. నేనేందుకు మీసం ఉంచుకోకూడదు’’ అని షౌజా పేర్కొంది.

ప్రపంచం తన గురించి ఏమనుకున్నా.. తాను పట్టించుకోనని.. మీసాలు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేనని షైజా తెలిపింది. కరోనా సమయంలోనూ తాను మీసాలను కప్పి ఉంచే మాస్క్ పెట్టుకోవడాన్ని ఇబ్బందిగా భావించానని పేర్కొంది. కాగా.. షైజా గత పదేళ్లలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఆరుసార్లు ఆపరేషన్లు జరిగాయని.. ఆపరేషన్ కోసం వెళ్లిన ప్రతీసారి ఇక వెళ్లాల్సిన అవసరం లేదని నమ్మెదాన్నంటూ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అయితే షైజా ప్రపంచంలోనే మీసాలు ఉన్న మొదటి మహిళ కాదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. 2016లో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ గుబురు గడ్డం కలిగిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.