CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఎంపీలు, మంత్రులతో హస్తినలో పర్యటన..

సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు, మరికొందరు మంత్రులు ఉండనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ రెండు మూడు రోజులు ఢిల్లీలోనే బస చేయనున్నట్లు సమాచారం.

CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఎంపీలు, మంత్రులతో హస్తినలో పర్యటన..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2022 | 12:03 PM

CM KCR Delhi Tour: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనకు సమయత్తమువుతున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు, మరికొందరు మంత్రులు ఉండనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ రెండు మూడు రోజులు ఢిల్లీలోనే బస చేయనున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి పయనం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం సమావేశమై.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పలు వ్యూహాలు రచించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి.

కాగా.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సైతం ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన తమిళిసై.. పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశముందని సమాచారం. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..