Monkeypox: తెలంగాణకు మంకీపాక్స్ ముప్పు తప్పేనా? కామారెడ్డి బాధితుడి సాంపిల్ రిజల్ట్ ఎప్పుడంటే?
Monkeypox: నిన్న కరోనా.. నేడు మంకీపాక్స్.. ఇలా కొత్త కొత్త వైరస్‌లు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. కరోనా వైరస్ ఇంకా కళ్లెదుట తిరుగుతుండగానే ఇప్పుడు మంకీపాక్స్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 75 వేల దేశాల్లో సుమారు 16 వేల కేసులు నమోదవ్వడం ఈ వైరస్..
Monkeypox: నిన్న కరోనా.. నేడు మంకీపాక్స్.. ఇలా కొత్త కొత్త వైరస్‌లు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. కరోనా వైరస్ ఇంకా కళ్లెదుట తిరుగుతుండగానే ఇప్పుడు మంకీపాక్స్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 75 వేల దేశాల్లో సుమారు 16 వేల కేసులు నమోదవ్వడం ఈ వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఈక్రమంలోనే ముందస్తు జాగ్రత్తగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇదిలా ఉంటే మనదేశంలోనూ వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో ముగ్గురు, ఢిల్లీలో ఒకరు ఈ రోగం బారిన పడ్డారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా మంకీపాక్స్ కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలోని ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు బయటపట్టాయి. దీంతో బాధితుడిని వెంటనే హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని బ్లడ్ సాంపిల్స్‌ను టెస్ట్ కోసం పుణెలోని NIV వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. కాగా ఈ రిజల్ట్ మంగళవారం (జులై 26) సాయంత్రానికల్లా రానుంది. ఒకవేళ మంకీపాక్స్ అని తేలితే రాష్ట్రంలో మరింత ఆందోళన పెరుగుతుంది. ఈక్రమంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆందోళన వద్దు.. కాగా ఈ రిజల్ట్ వచ్చే వరకు బాధితుడిని ఫీవర్ ఆస్పత్రిలోనే స్పెషల్ అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు. ఇదిలా ఉంటే కామారెడ్డికి చెందిన బాధితుడితో కాంటాక్ట్ అయిన మరో ఆరుగురిని గుర్తించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవన్నారు. అయినప్పటికీ ఆ ఆరుగురిని కూడా ఐసోలేషన్‌లో ఉంచినట్లు శ్రీనివాసరావు తెలిపారు. మంకీపాక్స్ గురించి ఆందోళన చెందవద్దని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..