Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సరికొత్తగా జీహెచ్ఎంసీ అన్నపూర్ణ క్యాంటిన్.. రూ. 5ల భోజనంతోపాటు అందుబాటులోకి మరిన్ని సౌకర్యాలు..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కో సర్కిల్‌లో 32 చోట్ల అన్నుపర్ణ క్యాంటీన్లను ప్రారంభించాలని యోచిస్తోంది. కొత్త క్యాంటీన్‌లో సీటింగ్‌తో పాటు పలు సౌకర్యాలు కల్పించనున్నారు.

Hyderabad: సరికొత్తగా జీహెచ్ఎంసీ అన్నపూర్ణ క్యాంటిన్.. రూ. 5ల భోజనంతోపాటు అందుబాటులోకి మరిన్ని సౌకర్యాలు..
Ghmc Rs 5 Meal Canteen
Follow us
Venkata Chari

|

Updated on: Jul 25, 2022 | 9:57 AM

హైదరాబాద్ నగర ప్రజలకు కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ పథకం ఎంతో విజయవంతమైంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆహార పథకం కింద, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లోని సాధారణ ప్రజల కోసం అన్నపూర్ణ క్యాంటిన్ ను సరికొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కేవలం నిల్చునే రూ.5ల భోజనాన్ని తినాల్సి వచ్చేంది. ఇక నుంచి కూర్చుని తినేందుకు వీలుగా కొత్త క్యాంటిన్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే చాలా చౌకగా క్యాంటీన్‌లో కూర్చొని ఆహారాన్ని ప్రజలు తినగలుగుతారు. అతి తక్కువ ధరకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడమే రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ ఆహార పథకాన్ని ప్రారంభించింది. 2014లో ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 10 కోట్ల మంది నగరవాసులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

32 చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు..

జీహెచ్‌ఎంసీలోని ఒక్కో సర్కిల్‌లో 32 స్థలాలను గుర్తించామని, ఇక్కడ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, కేవలం రూ.5కే వినియోగదారులకు ఆహారం, సీటింగ్ ఏర్పాట్లు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం కింద కేవలం రూ.5 వెచ్చించి అన్ని ప్రాంతాల ప్రజలు 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల కూరగాయల కూర, 15 గ్రాముల పచ్చిమిర్చి కూర పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

లాక్‌డౌన్‌కు ముందు 150 కేంద్రాల్లో..

లాక్‌డౌన్‌కు ముందు, నగరంలోని దాదాపు 150 కేంద్రాలలో ఈ పథకం అమలు చేశారు. రోజుకు సుమారు 45,000 మందికి భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి లాక్‌డౌన్ సమయంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో అన్నపూర్ణ ఆహారాన్ని పూర్తిగా ఉచితంగా అందించారు. మధ్యాహ్న భోజన సమయంలో, మొబైల్ అన్నపూర్ణ క్యాంటీన్‌తో సహా 373 కేంద్రాలలో, రాత్రి భోజన సమయంలో 259 కేంద్రాలలో ఆహారాన్ని అందించారు.