Cyber Crime: ఆర్డర్ చేయకుండానే పార్శిల్ వచ్చిందంటూ ఫోన్‌ కాల్.. తీరా అసలు విషయం తెలిస్తే ఫ్యూజులౌట్..

Cyber Crime: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకీ తెలివి మీరి పోతున్నారు. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొత్త మార్గాల ద్వారా జనాలు బురిడి కొట్టిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లకు మాల్వేర్లను పంపించి ఖాతాలను హ్యాక్‌ చేయడం, ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్‌ ఇలా...

Cyber Crime: ఆర్డర్ చేయకుండానే పార్శిల్ వచ్చిందంటూ ఫోన్‌ కాల్.. తీరా అసలు విషయం తెలిస్తే ఫ్యూజులౌట్..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 25, 2022 | 10:06 AM

Cyber Crime: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకీ తెలివి మీరి పోతున్నారు. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొత్త మార్గాల ద్వారా జనాలు బురిడి కొట్టిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లకు మాల్వేర్లను పంపించి ఖాతాలను హ్యాక్‌ చేయడం, ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్‌ ఇలా ఎన్నో రకాల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. జనాలు బురిడి కొట్టించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు కేటుగాళ్లు.

ఈ కొత్త రకం మోసం ఎలా జరుగుతుందంటే.. ఆన్‌లైన్‌లో ఎలాంటి ఆర్డర్‌ చేయకుండానే మీకు పార్శిల్‌ డెలివరి ఉందంటూ మొదట ఫోన్‌ కాల్‌ చేస్తారు. దీంతో అవతలి వ్యక్తి మేము ఎలాంటి బుకింగ్ చేయలేదని సమాధనం ఇస్తారు. అప్పుడే కేటుగాళ్లు తమ యాక్షన్‌ ప్లాన్‌ స్టార్ట్‌ చేస్తారు. మీ ఫోన్‌ నెంబర్‌పై ఆర్డర్‌ బుక్‌ చేసినట్లు చూపిస్తుంది. బహుశా రాంగ్ నెంబర్‌తో ఎవరైనా బుక్‌ చేసి ఉండొచ్చు. ఆర్డర్‌ను క్యాన్సల్ చేయాలంటే మీకు ఒక ఓటీటీ పంపిస్తాం.. ఆ నెంబర్‌ను చెప్పండి అని ఓటీపీ సెండ్‌ చేస్తారు. దీంతో ఆ ఓటీపీతో బ్యాంక్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని లాగేస్తున్నారు.

ప్రస్తుతం ఇలాంటి మోసాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. తాము ఓటీపీ ద్వారా మోసపోయామని ఫిర్యాదు చేస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసులు వినియోగదారులను అలర్ట్‌ చేశారు. తెలియని వ్యక్తులు ఎవరైనా ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని, అవగాహనతో ఉంటే సబైర్‌ నేరగాల్ల బారిన పడకుండా ఉండొచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..