AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి

Road Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను నివారిచేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి
Road Accident
Subhash Goud
|

Updated on: Jul 25, 2022 | 9:24 AM

Share

Road Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను నివారిచేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్ నుండి ఢిల్లీ వెళ్తున్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని హైదర్‌ఘర్ ఆస్పత్రికి తరలించారు. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు వెనుక నుంచి మరో డబుల్ డెక్కర్ బస్సును ఢీ కొట్టిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. మీడియా నివేదికల ప్రకారం.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నో ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వేపై దెబ్బతిన్న బస్సును క్రేన్ సహాయంతో తొలగిస్తున్నారు. దీని కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ప్రమాద స్థలిలో మృతుల కుటుంబ సభ్యులతో రోధనలు మిన్నంటాయి.

సీఎం యోగి సంతాపం

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ట్రాక్టర్‌ ట్రాలీ-కారు ఢీః

మరోవైపు బరేలీలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి మీర్‌గంజ్‌లోని సిధౌలీ పులియా సమీపంలో కన్వారియాస్ కారు ట్రాక్టర్ ట్రాలీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. అలాగే జూలై 22న యూపీలోని మౌ జిల్లాలోని ఉన్నావ్‌కు చెందిన బంగార్‌మావు ఎమ్మెల్యే శ్రీకాంత్ కతియార్ వాహనం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి స్వల్ప గాయాలైనప్పటికీ. వాస్తవానికి, అతను మంత్రి దయాశంకర్ ఇంటి నుండి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే 260 ద్వారా తిరిగి వస్తుండగా, అతను ప్రమాదానికి గురయ్యాడు.

జూలై 23న, హత్రాస్ సదాబాద్ రోడ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. అయితే హత్రాస్‌లో డంపర్ ఢీకొని మరణించిన ఆరుగురికి యూపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక పరిహారాన్ని ప్రకటించింది. ఇలా వరుస రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొందరు తీవ్ర గాయాలలో ఆస్పత్రుల పాలవుతున్నారు.

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్