Delhi: వ్యభిచార కేంద్రాలుగా స్పా, మసాజ్‌ సెంటర్లు.. గుట్టురట్టు చేస్తున్న పోలీసులు..!

Delhi: దేశంలో స్పా, మసాజ్‌ సెంటర్ల మాటున వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇటీవల దేశంలోని మెట్రోపాలిట నగరాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో బయట పడ్డాయి. తాజాగా వీటి చాటున సాగిస్తున్న..

Delhi: వ్యభిచార కేంద్రాలుగా స్పా, మసాజ్‌ సెంటర్లు.. గుట్టురట్టు చేస్తున్న పోలీసులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2022 | 6:15 PM

Delhi: దేశంలో స్పా, మసాజ్‌ సెంటర్ల మాటున వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇటీవల దేశంలోని మెట్రోపాలిట నగరాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో బయట పడ్డాయి. తాజాగా వీటి చాటున సాగిస్తున్న వ్యభిచారం దందా రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు. దయానంద్‌ విహార్‌లో జరుగుతున్న ఈ దందాపై పోలీసులు దాడులు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వెనెజ్‌ థాయ్‌ స్పా పేరుతో దయానంద్‌ విహార్‌లో సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన బయలుదేరి దాడులు నిర్వహించారు. కస్టమర్ల పేరుతో స్పాను సందర్శించిన పోలీసులు.. వ్యభిచార ముఠాను గుట్టురట్టు చేశారు. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. స్పా లైసెన్స్‌ కూడా గడువు ముగిసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. స్పా సెంటర్‌ను సీజ్‌ చేసేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముర్మరం చేశారు. అయితే ఇటీవల కూడా ఢిల్లీలో మసాజ్‌ సెంటర్ల ముసుగులో కొన్ని వ్యభిచార దందాల కేసులు వెలుగు చూశాయి.

ఈనెల 14న ఢిల్లీలోని పశ్చిమ విహార్‌ ప్రాంతంలో ఓ స్పాలో నిర్వహిస్తున్న సెక్స్‌ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టుచేశారు. అలాగే పశ్చిమ విహార్‌లో ఓ మాల్‌లోని స్పా సెంటర్‌లో సెక్సెరాకెట్‌ నడిపిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను విటుడిగా పంపించి స్పా సెంటర్‌పై దాడి చేసి ఓనర్‌ సహా 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే స్పా ఓనర్‌ అంతకు ముందు సెక్స్‌ వర్కర్‌గా పని చేసిన మహిళే అని, ఆ తర్వాత ఆమె సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసులు జరిపిన విచారణలో తేలింది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఢిల్లీలో ఈ తరహా సెక్స్‌ రాకెట్‌ ముఠాను గుట్టురట్టు చేశారు పోలీసులు. ఢిల్లీ సెంట్రల్‌ జిల్లాలో మసాజ్‌ పార్లర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటి యజమాని సహా ఏడుగురిని అదుపులో అరెస్టు చేశారు.

మార్చి 25న రిషబ్‌ విహార్‌, పంకజ్‌ ప్లాజాలోని అవేదం స్పాలో పోలీసులు జరిపిన దాడుల్లో సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న రెండు ముఠాలను గుట్టు రట్టు చేశారు. మార్చి 20న ఢిల్లీలో గ్రీన్‌ పార్క్‌లోని వెల్‌నెస్‌ స్పా సెంటర్‌లో కూడా సెక్స్‌ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ దాడులకు ముందు యంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌, ఢిల్లీ పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు తాము కస్టమర్లుగా నటిస్తూ ఈ దందాను బట్టబయలు చేశారు. ఇందులో స్పా, ఆయుర్వేద థెరఫీ సెంటర్‌ పేరుతో అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో స్పా యజమాని రాకేష్‌ కుమార్‌ గుప్తాతో పాటు మొత్తం 11 మంది మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. ఇలా ఢిల్లీలో స్పా సెంటర్ల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న వ్యభిచారాన్ని దందాలను పోలీసులు బయట్టబయలు చేస్తున్నారు. కేసులు నమోదు కావడంతో వారు కటకటాలపాలవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి