Railway Station: రైల్వే స్టేషన్‌లో దారుణం.. మహిళపై నలుగురు ఉద్యోగుల సామూహిక అత్యాచారం
Railway Station: దేశంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు ఇలా ఎన్నో ఘోరాలు జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు..
Railway Station: దేశంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు ఇలా ఎన్నో ఘోరాలు జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. రైల్వేకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఓ మహిళ (30)పై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు, వారికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. ఈ నలుగురు కూడా రైల్వే శాఖలో ఎలక్ట్రికల్ విభాగంలో పని చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన జూలై 21న జరుగగా, విచారణ చేపట్టి నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. రైల్వే స్టేషన్‌లోని ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సిబ్బంది మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ గత ఏడాది కాలంగా భర్త నుంచి విడిపోయి విడాకుల కోసం కోర్టులో కేసు నడుస్తోంది.
New Delhi Railway Station gang rape case
The victim, aged 30, was raped in the electrical maintenance staff hut at Railway Station platform 8-9 Thursday night. All 4 accused are Railway Employees in Electrical Department & have been arrested: DCP Railway Harendra Singh pic.twitter.com/qKsSDVQpRY
— ANI (@ANI) July 23, 2022
రెండేళ్ల కిందట రైల్వే ఉద్యోగి అయిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో వారు తరుచూ ఫోన్‌లో మాట్లాడేవారు. గత గురువారం అతని పుట్టిన రోజు సందర్భంగా ఆమెను పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు. దీంతో ఆమె అదే రోజు రాత్రి 10.30 గంటలకు కీర్తి నగర్ మెట్రో స్టేషన్‌లో దిగింది. అక్కడి నుంచి నిందితులు ఆమెను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 8-9 ప్లాట్‌ఫారమ్‌లకు తీసుకువచ్చి ఆ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఓ రూమ్‌లో కూర్చోబెట్టారు. ఇక ఇద్దరు బయట కాపలాగా ఉండి, మరో ఇద్దరు గదిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని రైల్వే పోలీసులకు తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి