Nitin Nabin: నిస్వార్థ నాయకత్వమే దేశానికి ముఖ్యం.. నితిన్ నబిన్‌కు మహంత్ స్వామి మహారాజ్ ఆశీస్సులు
బీజేపీ జాతీయ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబిన్ తన తొలి గుజరాత్ పర్యటనను ఆధ్యాత్మిక సేవతో ప్రారంభించారు. గాంధీనగర్‌లోని పవిత్ర అక్షరధామ్ క్షేత్రాన్ని సందర్శించిన ఆయన, మహంత్ స్వామి మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. అగ్రనేతలతో కలిసి స్వామీజీని కలిసిన నబిన్, దేశాభివృద్ధి, ఐక్యతపై దిశానిర్దేశం పొందారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తిన్ నబిన్ తొలిసారిగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీనగర్‌లోని సుప్రసిద్ధ పూజ్య స్వామినారాయణ్ అక్షరధామ్ క్షేత్రాన్ని సందర్శించి, పవిత్ర మహంత్ స్వామి మహారాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రానికి విచ్చేసిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ భేటీలో నితిన్ నబిన్ మహంత్ స్వామి మహారాజ్ నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దేశంలో నిరంతర శాంతి, ఐక్యత, సామరస్యం, శ్రేయస్సు వెల్లివిరియాలని స్వామీజీ ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నైతిక విలువలతో కూడిన నాయకత్వం దేశాభివృద్ధికి ఎంతో అవసరమని ఆయన తెలిపారు.
ఈ పర్యటనలో నితిన్ నబిన్ వెంట పలువురు బిజెపి అగ్రనేతలు ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, జగదీష్ విశ్వకర్మ, రత్నాకర్జీ సహా పలువురు నేతలు ఆయన వెంట ఉన్నారు. మహంత్ స్వామి మహారాజ్ తన సందేశంలో.. కరుణ, నిస్వార్థ నాయకత్వం, సమగ్రత వంటి విలువలను ప్రతి నాయకుడు అలవర్చుకోవాలని సూచించారు. సమాజ సమగ్ర అభివృద్ధికి, సాంస్కృతిక విలువల పరిరక్షణకు ఉమ్మడి నిబద్ధత అవసరమని ఈ సమావేశం చాటిచెప్పింది. అక్షరధామ్ యొక్క ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక సంభాషణ ప్రజా జీవితంలో నైతిక విలువల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది.
