SI Murder Case: మహిళా ఎస్ఐని వాహనంతో తొక్కించి చంపిన దుండగులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
హర్యానా మైనింగ్ మాఫియా చేతిలో హతమైన డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. డీఎస్పీ హత్య తరహాలోనే ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు.
హర్యానా మైనింగ్ మాఫియా చేతిలో హతమైన డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. డీఎస్పీ హత్య తరహాలోనే ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సబ్ ఇన్‌స్పెక్టర్ సంధ్య టోప్నే. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వాహనంతో వేగంగా దూసుకొచ్చింది. పశువులను తరలిస్తున్నారని ఎస్సైకి సమాచారం అందింది. ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దాంతో ఎస్సై సంధ్యను అత్యంత దారుణంగా ఢీకొట్టాడు డ్రైవర్. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్ హత‍్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

