Andhra Pradesh: రవ్వంత గుంత తవ్వితే.. రహస్య గుట్టు వీడింది.. ఇలా తయారయ్యారేంట్రా బాబు
తగ్గేదే లే అంటున్నారు స్మగ్లర్స్. తమ పైత్యం చూపిస్తునే ఉన్నారు. అవసరమైతే దాడులకు తెగబడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.
Smuggling: విలువైన కలప ఏదైతే ఏంది..? మేము దోచేస్తాం అంటున్నారు కేటుగాళ్లు. తాము కూడా పుష్పకు ఏ మాత్రం తగ్గమని నిరూపించుకుంటున్నారు. తేడా వస్తే దాడులకు కూడా తెగబడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి.. విలాసాల బాట పడుతున్నారు. అడ్డొస్తే అధికారులు అని కూడా చూడటం లేదు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri seetharama raju district) ఎటపాక మండలం లక్ష్మీదేవిపేట శివారులో ఇలంటి ఘటనే వెలుగుచూసింది. తనిఖీల భయంతో ఇస్మార్ట్‌గా వ్యవహరించారు స్మగ్లర్స్. ఏకంగా గుంత తీసి.. అందులో అక్రమంగా నరుక్కువచ్చిన 30 టేకు దుంగలు పెట్టి.. మళ్లి మట్టి కప్పారు. సరైన అదును కుదిరినప్పుడు వాటిని తరలించాలని భావించారు. కానీ వీటి గురించి ఫారెస్ట్ అధికారులకు ఉప్పు అందింది. అటవీశాఖ బీట్ అధికారి మూర్తి… తన టీమ్‌తో కలిసి గురువారం తనిఖీలు చేపట్టగా.. ఈ టేకు దుంగల ఆచూకి దొరికింది. తనిఖీల విషయం తెలుసుకున్న మండలంలోని రాజపేటకు చెందిన కొందరు వ్యక్తులు ఫారెస్ట్ ఆఫీసర్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై చింతూరు DFO సాయిబాబును వివరణ కోరగా… దాడి వాస్తవమేనని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..