CM Jagan: నియోజకవర్గాలే టార్గెట్‌.. జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పార్టీ కార్యకర్తలతో నేరుగా సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. అక్టోబర్‌..

CM Jagan: నియోజకవర్గాలే టార్గెట్‌.. జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
Cm Jagan
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2022 | 4:25 PM

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పార్టీ కార్యకర్తలతో నేరుగా సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. అక్టోబర్‌ నెలలోపు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నేతలను ఆదేశించారు. పార్టీ బలోపేతం, 175 నియోజకవర్గాలే టార్గెట్‌గా పని చేయాలని మరోసారి జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో సమావేశం అయ్యారు. గడపగడపు కార్యక్రమాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు.

అలాగే పార్టీ సోషల్‌ మీడియాను బలోపేతం చేస్తూ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్‌ సూచించారు. కాగా, వచ్చే ఎన్నికల కోసం వైసీపీ ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచే కమిటీలన్ని పూర్తి చేసుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పార్టీ పునాదులు బలోపేతం అయ్యాలా చర్యలు తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి