AP Government : పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. 43 వేలమంది కుటుంబాల్లో నిండిన సంతోషం

మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పలు డిమాండ్‌లతో సమ్మెకు దిగారు. తమ జీతాలు పెంచాలంటూ మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా..

AP Government : పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. 43 వేలమంది కుటుంబాల్లో నిండిన సంతోషం
Cm Jagan
Follow us

|

Updated on: Jul 23, 2022 | 8:39 PM

AP Government : ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాల్టీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏ(ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు)కు సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను ప్రభుత్వం చెల్లించనునుంది. దాంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్టయింది. తాజా ఉత్తర్వులతో దాదాపు 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది. ఈ ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కార్మికులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల ఏపీలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పలు డిమాండ్‌లతో సమ్మెకు దిగారు. తమ జీతాలు పెంచాలంటూ మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య భృతిని కూడా తమ డిమాండ్లలో కార్మికులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. చర్చల అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించడం.. కేబినెట్‌ కమిటీ ద్వారా సమస్య పరిష్కారం త్వరగతిన పూర్తైంది. అంతేకాదు.. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?