Sandstorm: అక్కడ శాంతించిన వరుణుడు.. వణికిస్తున్న ఇసుక తుఫానుతో చైనా విలవిల

ఇసుకతో కూడిన భారీ మేఘాలు వేగంగా కదులుతూ..పెద్ద పెద్ద భవనాలు, కార్లను చుట్టుముట్టాయి. సూర్య కిరణాలను సైతం ఇసుక తుఫాను కమ్మేసింది..

Sandstorm: అక్కడ శాంతించిన వరుణుడు.. వణికిస్తున్న ఇసుక తుఫానుతో చైనా విలవిల
Sandstorm
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2022 | 3:00 PM

Sandstorm: చైనాను ఇసుక తుఫాను వణికిస్తోంది. చైనాలోని వాయువ్య ప్రాంతంలో భారీ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. ఇసుక తుఫానుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇసుకతో కూడిన భారీ మేఘాలు వేగంగా కదులుతూ..పెద్ద పెద్ద భవనాలు, కార్లను చుట్టుముట్టాయి. సూర్య కిరణాలను సైతం ఇసుక తుఫాను కమ్మేసింది.. క్వింఘై ప్రావిన్స్‌లోని కొన్ని పట్టణాల్లో దృశ్యమానత 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఇసుక తుఫాను దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిందని పేర్కొంది. గంటకు 53 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కాలుబయటపెట్టలేని పరిస్థితిలో ఇళ్లలోనే ఉండిపోయారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చైనా మీడియా పేర్కొంది. చైనాలోని క్వింఘైలోని కొన్ని ప్రాంతాలు ఎడారులు. వారం మధ్యలో దేశంలోని పశ్చిమ ప్రాంతంలో పిడుగులు పడడంతో ఈ ప్రాంతాల నుంచి ఇసుక గాలిలోకి ఎగసిపడిందని అక్యూవెదర్‌లోని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

చైనా వాయువ్య ప్రాంతంలో ఇసుక తుఫానులు తరచుగా వస్తుంటాయి. 2021లో, ఒక భారీ తుఫాను డన్‌హువాంగ్ నగరాన్ని చుట్టుముట్టింది. ఎటు చూసినా ఇసుక తుఫాను కమ్మేయటంతో పరిసరాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల మాదిరిగానే చైనా కూడా తీవ్రమైన వేడిని ఎదుర్కొంటోంది. ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌లను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. షాంఘైలో ఈ నెలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఈ ఏడాది యూరప్‌లో కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిగాలులు మరియు కరువు కారణంగా స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్‌లో కార్చిచ్చు కారణంగా పెద్ద మొత్తంలో అడవి తగలబడింది.

స్పెయిన్‌లో, జూలై 9 నుండి 18 మధ్య తీవ్రమైన వాతావరణం కారణంగా 500 మంది మరణించారు. రాబోయే సంవత్సరాల్లో వేడిగాలులు మరింత తరచుగా, తీవ్రంగా మారుతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. అవి చాలా తరచుగా జరుగుతున్నాయి. గత పది సంవత్సరాలలో ఇంతటి తీవ్రమైన తుఫాను తాము చూడలేదని ఈ ఇసుక తుఫాను ఈ సారి చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది అని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి