NIA: ఆ ఉగ్రవాది ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటన

ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ పూజారి హత్యకు కుట్ర పన్నింది అతడే... దీనికి నిజ్జర్ చీఫ్ గా ఉన్నాడు. గత ఏడాది భారత్ లో ఉగ్రకుట్రకు పాల్పడ్డాడనే కేసులో..

NIA: ఆ ఉగ్రవాది ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటన
Ktf Terrorist
Follow us

|

Updated on: Jul 23, 2022 | 4:22 PM

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భారీ రివార్డును ప్రకటించింది. గత ఏడాది జలంధర్‌లో హిందూ పూజారిని హత్య చేసిన కేసులో కెనడాకు చెందిన ఖలిస్తాన్‌ టైగర్‌ఫోర్స్‌(కేటీఎఫ్‌) చీఫ్‌పై సమాచారం ఇస్తే జాతీయ దర్యాప్తు సంస్థ రివార్డును ప్రకటించింది. హిందూ పూజారి హత్యకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్న హర్దీప్ పై రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ పూజారి హత్యకు కుట్ర పన్నింది. దీనికి నిజ్జర్ చీఫ్ గా ఉన్నాడు. గత ఏడాది భారత్ లో ఉగ్రకుట్రకు పాల్పడ్డాడనే కేసులో నిజ్జర్ పై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఈ మధ్య కెనడాలో మరణించిన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య కేసులోనూ హర్దీప్ సింగ్ పాత్రను తోసిపుచ్చలేమని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సహకరించే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఎన్‌ఐఏ తెలిపింది. నిందితులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించేందుకు ఎన్‌ఐఏ ఢిల్లీ ప్రధాన కార్యాలయం, చంఢీగఢ్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌లోని టెలిఫోన్‌, వాట్సాప్‌ మరియు టెలిగ్రామ్‌ నంబర్‌లను విడుదల చేశారు.

గతేడాది జనవరి 31న జలంధర్‌లోని ఫిల్లూరు గ్రామంలో హిందూ పూజారి కమల్‌దీప్‌ శర్మ హత్యకు గురయ్యాడు. నిజ్జర్‌తో సహా నలుగురిపై జూలై 5న ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ వారిపై అక్టోబర్‌8, 2021న కేసు నమోదు చేసింది. ఈ కేసులోని మరో ముగ్గురు నిందితులు కమల్‌జీత్‌ శర్మ, రామ్‌సింగ్‌ అలియాస్‌ సోనా, నిజ్జర్‌ అతని సహచరుడు ప్రభ్‌ సూచనల మేరకు పూజారిపై దాడి చేశారు. కెనడాకు చెందిన నిందితులు పూజారిని చంపడం ద్వారా పంజాబ్‌లో శాంతి, మత సామరస్యాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.