Fishing: చేపల కోసం వల వేస్తే అనుకోనిది చిక్కింది.. దాని విలువ దాదాపు రూ. 30 కోట్లు!

మత్స్యకారులకు దొరికిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు. ఇది ఒక కిలో అంబర్‌గ్రిస్‌ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు కోటి రూపాయలు పలుకుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Fishing: చేపల కోసం వల వేస్తే అనుకోనిది చిక్కింది.. దాని విలువ దాదాపు రూ. 30 కోట్లు!
Whale Vomits
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2022 | 3:44 PM

Whale vomits: కోట్ల విలువైన తిమింగలం వాంతి లభ్యమైంది. మార్కెట్‌లో రూ.28 కోట్ల విలువైన తిమింగలం వాంతులు బయటపడ్డాయి. విజింజం నుంచి చేపల వేటకు వెళ్లిన వారికి అరుదైన తిమింగలం వాంతి లభించింది. మత్స్యకారులకు దొరికిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు. విజింజమ్‌కు 32 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో తిమింగలం వాంతులు తేలుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. ఆ బృందంలో ఉన్న లారెన్స్ అనే మత్స్యకారుడు ఒకరు మాట్లాడుతూ.. సముద్రంలో తిమింగలం ఉన్నప్పుడు తిమింగలం వాంతికి సమానమైన వాసన వస్తుందని చెప్పారు. తిమింగలం వాంతులు కనిపించడం తనకు ఇదే తొలిసారి అని, అది చూడగానే అసలు వాంతి వచ్చిందా అని అనుమానం వచ్చిందని సదరు మత్స్యకారుడు చెప్పుకొచ్చాడు. అనంతరం బోటులో దానిని ఒడ్డుకు చేర్చి తిమింగలం వాంతి అని నిర్ధారించుకున్న మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. తాను 30 ఏళ్లకు పైగా చేపల వేట సాగిస్తున్నానని, అయితే తాను చాలాసార్లు తిమింగలాలను చూసినప్పటికీ, హంప్‌బ్యాక్ తిమింగలం కనిపించడం ఇదే మొదటిసారని చెప్పారు.

సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకొచ్చిన తిమింగలం వాంతిని కోస్టల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు విజింజమ్‌కు చేరుకుని తిమింగలం వాంతిని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌కు తరలించి వివరాలు పరిశీలించారు. సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే తిమింగలం వాంతి దీనినే అంబర్‌గ్రిస్ అని కూడా అంటారు.. ఇది ఒక కిలో అంబర్‌గ్రిస్‌ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు కోటి రూపాయలు పలుకుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి