Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Cave: అంతుచిక్కని రహస్యలతో నిండిన గుహ.. టికెట్‌ ధర కూడా ఖరీదే.. ఇంతకీ అందులో ఏముంది..?

కేవ్ మొత్తం పొడవు దాదాపు 9 కిలోమీటర్లు. ఇందులో150 విభిన్న గుహలను కలిగి ఉంటుంది. ఈ గుహ లోపల

Mysterious Cave: అంతుచిక్కని రహస్యలతో నిండిన గుహ.. టికెట్‌ ధర కూడా ఖరీదే.. ఇంతకీ అందులో ఏముంది..?
Mysterious Cave
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2022 | 4:56 PM

Mysterious Cave:  మనం నివసిస్తు్న ఈ భూమి ఎంతో అందమైనదో అదే స్థాయిలో ఎన్నో రహస్య విషయాలు కూడా ఉన్నాయి. భూమిపై ఎన్నో ఆధ్యాత్మిక భయానక ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి.. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన గుహగా పరిగణించబడే ఓ గుహ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ గుహ చాలా పెద్దది. అందులో అనేక బహుళ అంతస్తుల భవనాలను నిర్మించవచ్చని చెబుతున్నారు.ఇందులో 40 అంతస్తుల ఎత్తు వరకు భవనాలు నిర్మించవచ్చు. ఇది వియత్నాంలోని ‘సోన్ డాంగ్’ గుహ..ఈ గుహ సెంట్రల్ వియత్నాంలోని అడవిలో ఉంది. సోన్ డాంగ్ కేవ్ మొత్తం పొడవు దాదాపు 9 కిలోమీటర్లు. ఇందులో150 విభిన్న గుహలను కలిగి ఉంటుంది. ఈ గుహ లోపల మొక్కల నుండి అడవులు, నదుల వరకు ప్రతిదీ కనిపిస్తాయి.. మిలియన్ సంవత్సరాల నాటి ఈ గుహను 2013లో తొలిసారిగా పర్యాటకుల కోసం తెరిచారు. ప్రతి సంవత్సరం 250 నుంచి300 మంది మాత్రమే ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనుమతినిస్తారంటే నిజంగా ఇది ఆశ్చర్యకర విషయమే మరీ.

ఈ గుహను 1991లో ‘హో ఖాన్’ అనే స్థానికుడు కనుగొన్నాడు. అయితే ఆ సమయంలో గుహలో ప్రవహించే నీటి గర్జన, కారు చీకటి కారణంగా ఎవరూ లోపలికి వెళ్లడానికి సాహసించలేదు. 2009లో బ్రిటిష్ రీసెర్చ్ అసోసియేషన్ ప్రపంచానికి మొదటి సంగ్రహావలోకనం చూపడంతో ఈ గుహ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. తరువాత 2010లో శాస్త్రవేత్తలు ‘వియత్నాం గోడ’ అని కూడా పిలువబడే 200 మీటర్ల ఎత్తైన గోడను దాటడం ద్వారా గుహ లోపల ఒక మార్గాన్ని కనుగొన్నారు.

ఈ గుహలోకి ప్రవేశించడానికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల టిక్కెట్టు. గుహలోకి వెళ్లే పర్యాటకులకు మొదటి ఆరు నెలలు శిక్షణ ఇస్తారు. కనీసం 10 కిలోమీటర్లు నడవడం, ఆరుసార్లు రాక్‌క్లైమ్‌ చేయడం వంటివి నేర్పిస్తున్నారు. అప్పుడే వారిని గుహలోకి తీసుకెళ్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి