AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్నారిపై దారుణంగా దాడి చేసిన కోతి.. వీడియో చూస్తే దడ పుట్టాల్సిందే

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే లేదు. జంతువులు చేసే చిత్ర విచిత్రమైన పనులు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే జతువులు చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెపిస్తే మరికొన్ని సార్లు వణుకు పుట్టిస్తాయి..

Viral Video: చిన్నారిపై దారుణంగా దాడి చేసిన కోతి.. వీడియో చూస్తే దడ పుట్టాల్సిందే
Monkey
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2022 | 5:09 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ వీడియోల(Viral Video)కు కొదవే లేదు. జంతువులు చేసే చిత్ర విచిత్రమైన పనులు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే జతువులు చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెపిస్తే మరికొన్ని సార్లు వణుకు పుట్టిస్తాయి. చిన్న జంతువే కదా అని అనుకుంటే అవి ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే వెనులో వణుకు పుట్టకుండా ఉండదు. కోతులు నిత్యం మనకు తారసపడుతూనే ఉంటాయి. గ్రామాల్లో అయితే ఇళ్లమధ్యలోనే తిరుగుతూ కంటికి కనిపించిన ఆహారాన్ని ఎత్తుకుపోతుంటాయి. అయితే కొన్ని సార్లు కోతులు మనుషుల పై దాడి కూడా చేస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కోతి చిన్నారి పై దారుణంగా దాడి చేసింది.

రష్యాలోని టెర్పిగోరివో గ్రామంలో జరిగింది ఈ సంఘటన.. ఇంటి బయట తన స్నేహితులతో కలిసి ఓ రెండేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఓ కోతి వచ్చింది. అయితే అది ఆ చిన్నారి పై ఉన్నట్టుండి దాడికి పాల్పడింది. అక్కడ ఓ నిచ్చెన పైకి ఎక్కుతోన్న చిన్నారి కాలును పట్టుకొని కిందికి లాగి పడేసింది. ఆ పై ఆ చిన్నారిని కింద పడేసి ఇష్టమొచ్చినట్టు లాగింది,కరిచింది. ఆ చిన్నారి అరుపులు విన్న తల్లిదండ్రులు బయటకు వచ్చి కోతిని తరిమేందుకు ప్రయత్నించారు. ముందుగా వచ్చిన చిన్నారి తల్లి ఆమెను ఎత్తుకున్నప్పటికీ ఆ కోతి దాడి చేయడం ఆపలేదు. ఆ తర్వాత చిన్నారి తండ్రి వచ్చి కోతిని తరిమే ప్రయత్నం చేసినా కూడా అది ఆగలేదు.. ఆ చిన్నారి పై దాడి చేస్తూనే ఉంది. ఇదంతా ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీలో రికార్డైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..