Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే మంచిగుండదు.. ఖబర్దార్.. అంటున్న శునకం.. వామ్మో అంటున్న నెటిజన్లు..
తాజాగా ఓ చిన్నారిని ఎవరైనా ముట్టుకుంటే ఖబడ్డార్ అంటుంది పెంపుడు కుక్క. ఆ బుడ్డొడిపై చెయ్యి కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్
పిల్లలకు.. ఇంట్లో పెంపుడు జంతువులకు మధ్య ఉండే బంధం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. పిల్లలపై అమితమైన ప్రేమను చూపిస్తుంటాయి. వాళ్లతో ఆడుకుంటూ..వారిని ప్రమాదాల నుంచి రక్షిస్తూ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కుక్క పిల్లలు, పిల్లులు ఇంట్లోని చిన్న పిల్లలపై చూపించే ప్రేమకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారిని ఎవరైనా ముట్టుకుంటే ఖబడ్డార్ అంటుంది పెంపుడు కుక్క. ఆ బుడ్డొడిపై చెయ్యి కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో పసికందు పాలు తాగుతూ హాయిగా పడుకున్నాడు. ఆ చిన్నారి పక్కనే ఓ పెంపుడు కుక్క సైతం కూర్చుంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిన్నారిని పట్టుకువడానికి ప్రయత్నించగా.. వెంటనే ఆ శునకం అతని చెయి పట్టేసి పక్కకు నెట్టింది. మరోసారి అతని చేయి ముందుకు రాగా కాలుతో చేతిని పక్కకు లాగి అతడిని కోపంతో చూసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అనుమానిత వ్యక్తుల నుంచి పెంపుడు కుక్కలు చిన్న పిల్లలను కాపాడతాయని.. ఎంతో నమ్మకంగా ఉంటాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆ బాబు తండ్రి కాదని.. అందుకే ఆ కుక్క అతడిని ఆపుతుందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆ పెంపుడు కుక్క నమ్మకానికి.. జాగ్రత్తకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
No touching…??? pic.twitter.com/PwWRjPby2D
— Laughs 4 All ? (@Laughs_4_All) July 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.