AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: రామ్ చరణ్‏కు ఆసక్తికర ట్యాగ్ ఇచ్చిన సమంత.. ధనుష్, అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

కాఫీ విత్ కరణ్ షోలో రాపిడ్ ఫైర్ రౌండ్‏లో భాగంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు ఒక్కమాటలో సమాధానమిచ్చింది సామ్. అందులో రామ్ చరణ్ గురించి అడగ్గా..

Samantha: రామ్ చరణ్‏కు ఆసక్తికర ట్యాగ్ ఇచ్చిన సమంత.. ధనుష్, అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2022 | 7:57 AM

Share

పాపులర్ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్ 7లో టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha) సందడి చేసింది. హీరో అక్షయ్ కుమార్‏తో కలిసి ఊ అంటావా మావ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. అంతేకాకుండా కరణ్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి సామ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో కంటే ప్రస్తుతం తాను మరింత బలంగా ఉన్నానని.. తన జీవితంలో మరోసారి ప్రేమను ఆహ్వానించడానికి సిద్ధంగా లేనట్లు చెప్పుకొచ్చింది. అలాగే తాను రూ. 250 కోట్లు భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలలో ఏలాంటి వాస్తవం లేదని చెప్పింది. అంతేకాకుండా.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్, ధనుష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కాఫీ విత్ కరణ్ షోలో రాపిడ్ ఫైర్ రౌండ్‏లో భాగంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు ఒక్కమాటలో సమాధానమిచ్చింది సామ్. అందులో రామ్ చరణ్ గురించి అడగ్గా.. ఓజీ అని ఠక్కున చెప్పేసింది. ఓజీ అంటే అర్థం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ అదిరిపోయే ట్యాగ్ ఇచ్చింది. అలాగే అల్లు అర్జున్ అంటే మ్యాజిక్ అని తెలిపింది. ఇక ధనుష్ ది గ్లోబల్ స్టార్ అని చెప్పింది. అలాగే ఇటీవల కాతు వాకుల్ రెండు కాదల్ సినిమా సమయంలో నయనతారతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంది. తమ మధ్య మంచి స్నేహబంధం కలిసిందని.. ఇద్దరు హీరోయిన్లు ఉండే చిత్రాల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభద్రతాభావం లేదని తెలిపింది. ప్రస్తుతం సామ్ యశోద, ఖుషి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తాప్మీ నిర్మిస్తోన్న సినిమా ద్వారా సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో