Viral Video: దేవుడిలా వచ్చాడు.. ఐదో అంతస్థు నుంచి కిందపడిన చిన్నారిని కాపాడాడు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు ఆకట్టుకోవడంతోపాటు ప్రజల హృదయాలను గెలుచుకుంటాయి. తాజాగా.. జరిగిన అలాంటి ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Man catches girl: సోషల్ మీడియాలో అనునిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు ఆకట్టుకోవడంతోపాటు ప్రజల హృదయాలను గెలుచుకుంటాయి. తాజాగా.. జరిగిన అలాంటి ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐదో అంతస్తులో కిటికీ లోంచి కింద పడిన చిన్నారిని పట్టుకుని ఓ వ్యక్తి హీరోలా నిలిచాడు. ఈ ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశంలో చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని టోంగ్జియాంగ్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మెట్రో కథనం ప్రకారం.. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని టోంగ్జియాంగ్‌లో షెన్ డాంగ్ అనే వ్యక్తి తన కారును పార్క్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. పార్క్ చేస్తున్న క్రమంలో రెండేళ్ల చిన్నారు ఐదో అంతస్థు నుంచి కింద పడిపోతున్న దృశ్యాన్ని చూశాడు. అదే సమయంలో పెద్దగా కేకలు వినిపించడంతో.. షెన్ డాంగ్, అతని భార్య వేగంగా ముందుకు పరుగెత్తుకొచ్చారు. కిటికీ నుంచి కిందపడిన పాపను రెండు చేతులతో షేన్ డాంగ్ పట్టుకున్నాడు.
వీడియో చూడండి..
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022
కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా పాప.. ఒక స్టీల్ రూఫ్ మీద పడింది. అక్కడి నుంచి క్షణాల్లోనే కిందకు జారింది. ఈ క్రమంలో షెన్ డాంగ్ దంపతులు వేగంగా స్పందించడంతో పాప ప్రాణాలు నిలిచాయి. దీంతో నెటిజన్లు షెన్ డాంగ్ నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చైనా ప్రభుత్వ అధికారి లిజియాన్ జావో ట్విట్టర్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షిస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..