AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Planadu District: సాధువు వేషంలో వచ్చాడు.. ఊహించని షాక్ ఇచ్చి వెళ్లాడు.. జనాలూ జర భద్రం..!

బీ అలెర్ట్. మా ఊరు కొత్త బాబా వచ్చాడని ఓ మొక్కేయకండి. సాధువు వచ్చి 'భవతి భిక్షాం దేహి' అనగానే.. తులమో ఫలమో ఇచ్చి పంపించకండి. కాస్త వెనకా, ముందూ ఆలోచించండి.

Planadu District: సాధువు వేషంలో వచ్చాడు.. ఊహించని షాక్ ఇచ్చి వెళ్లాడు.. జనాలూ జర భద్రం..!
Ap Crime News
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2022 | 11:07 AM

Share

AP Criem News: ఈ మధ్యకాలంలో మాయగాళ్లు పెరిగిపోయారు. తప్పులు చేసేందుకు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ముసుగులు వేసి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల్లా కనిపిస్తూ.. అమాంతం దోచుకెళ్లుపోతున్నారు. ఇస్మార్ట్ ఐడియాలతో పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరు(Krosuru)లో పట్టపగలే ఓ బైక్ చోరీ స్థానికంగా కలకలం రేపింది. సాధువు వేషంలో భిక్షాటనకు వచ్చి బైక్ దొంగిలించుకుని వెళ్లాడు ఓ వ్యక్తి. దీంతో బాధితులు స్థానిక పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ ఫుటేజ్‌ ఆధారంగా దొంగను గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. బైక్‌కు వీలు చిక్కింది దాన్ని దోచుకుని వెళ్లిపోయాడు. అదే ఇంకాస్త అనువుగా ఉంటే ఇళ్లు గుళ్లచేసి పోయేవాడు. అందుకే ఎవరైనా కాషాయం దుస్తుల్లో వస్తే.. కొంగొత్త దేవుడంటూ కాళ్ల మీద పడకుండా.. కాస్త వెనకా ముందు ఆలోచించండి. భక్తి ఉండటంతో తప్పులేదు.. కానీ ఇలా దొంగతనాలు, మేజిక్స్ చేసే బాబాలు, సాధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే సర్వం దోచుకెళ్లిపోతారు. తస్మాత్ జాగ్రత్త.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!