Yadadri Temple : యాదాద్రి ఆలయ ప్రాంగణంలో అపచారం..క్యూ కాంప్లెక్స్ భవనంపై నుంచి పడి పంది మృతి..
క్యూ లైన్ లో నుంచి ఆలయ తిరువీధిలోకి ఒక్కసారిగా పరుగెత్తుకొచ్చింది. అడవి పందిని చూసి ఒక్కసారి భక్తులు భయపడ్డారు. పోలీసులు, ఆలయ సిబ్బంది,

Yadadri Temple
Yadadri Temple : పవిత్ర యాదాద్రి లక్ష్మినరసింహుడి కొండపై అడవిపంది కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. క్యూ కాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటు పరిగెత్తింది. క్యూ లైన్ లో నుంచి ఆలయ తిరువీధిలోకి ఒక్కసారిగా పరుగెత్తుకొచ్చింది. అడవి పందిని చూసి ఒక్కసారి భక్తులు భయపడ్డారు. పోలీసులు, ఆలయ సిబ్బంది, భక్తులు అడవిపందిని పట్టుకునేందుకు దాని వెంట పరిగెత్తారు. వారి నుంచి తప్పించుకునేందుకు క్యూ కాంప్లెక్స్ పై నుంచి విష్ణు పుష్కరిణి వైపు దూకింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పైనుంచి కింద పడింది. దీంతో అక్కడికక్కడే చనిపోయింది అడవిపంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
