Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

London: మూడేళ్ల క్రితం చనిపోయింది.. రెండేళ్లుగా రెంట్ పే చేస్తోంది.. విచిత్ర ఘటనలో విస్తుపోయే వాస్తవాలు..!

London: లండన్‌లోని పేక్‌హామ్‌లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. అద్దెదారు తన ప్లాట్‌లో చనిపోయి మూడేళ్లు అవుతున్నప్పటికీ..

London: మూడేళ్ల క్రితం చనిపోయింది.. రెండేళ్లుగా రెంట్ పే చేస్తోంది.. విచిత్ర ఘటనలో విస్తుపోయే వాస్తవాలు..!
Man Died
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2022 | 9:46 AM

London: లండన్‌లోని పేక్‌హామ్‌లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. అద్దెదారు తన ప్లాట్‌లో చనిపోయి మూడేళ్లు అవుతున్నప్పటికీ.. ఇంటి యజమానికి మాత్రం అద్దె అందుతోంది. ఈ అంతుచిక్కని విషయంలో అసలు మ్యాటర్ తాజాగా వెల్లడైంది. దాంతో అందరూ షాక్ అయ్యారు. 61 ఏళ్ల షీలా

పేక్‌హామ్‌లోని ఓ ప్లాట్‌ రెంట్ తీసుకుని నివాసం ఉంటోంది షీలా సెలియోనే(61). 2019 ఆగస్టులో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కన్నుమూసింది షీలా. అయితే, ఈ విషయాన్ని ఇంతకాలం ఎవరూ గుర్తించలేదు. తాజాగా పోలీసులు ఆమె ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా.. అసలు విషయం తెలిసిందే. షీలా చనిపోయి మూడేళ్లు అవుతుందని నిర్ధారించారు పోలీసులు. తాను కూర్చున్న సోఫాలో అలాగే కన్నుమూసినట్లు తేల్చారు. ఆమె మృతి పట్ల ఎలాంటి అనుమానాలు వ్యక్తమవకపోవడంతో.. సహజ మరణంగా ధృవీకరించారు అక్కడి పోలీసులు.

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 2019 నుండి ఆమె ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తోందని గుర్తించారు. ఇదే విషయాన్ని వారు హౌసింగ్ అసోసియేషన్‌కు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. దీనిపై ఆమె రూమ్ డోర్ ఎదుట ఫిర్యాదులు, లేఖలు వేశారు అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాంతో చెక్ చేయడానికి పోలీసులను రెండుసార్లు పిలిచారు. అయితే, ఆమె క్షేమంగా ఉందని పోలీసులు భావించి లైట్ తీసుకున్నారు. బలవంతంగా లోపలికి వెళ్లేందుకు తగిన కారణం లేదని భావించిన పోలీసులు.. అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆమె చివరిసారిగా ఏప్రిల్ 2019లో కనిపించిందని, ఆగస్టు 2019లో ఆమె చివరిసారిగా నెలవారీ అద్దె చెల్లించిందని అక్కడివారు తెలిపారు.

మూడేళ్లుగా అద్దె చెల్లింపులు.. అద్దె విషయంలో ఆటోమాటిక్ విధానాన్ని సెట్ చేసింది షీలా. ఒకసారి ఆమె అద్దె చెల్లించడంలో విఫలమైతే.. పీబాడీ హౌసింగ్ గ్రూప్ ఆమె యూనివర్సల్ క్రెడిట్ చెల్లింపుల నుండి నేరుగా అద్దె చెల్లించేలా అప్లై చేసింది. ఈ అప్లికేషన్‌కు ఆమోదం లభించడంతో.. అద్దె డబ్బు మార్చి 2020 నుండి హౌసింగ్ సొసైటీకి ప్రతి నెలా చెల్లించడం జరుగుతోంది. అయితే, ఎవరూ షీలా గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. జూన్ 2020లో సాధారణ గ్యాస్ చెకప్ కోసం అధికారులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో ఫ్లాట్‌కు గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయింది.

లాస్ట్ డే అదే.. ఇక GP నివేదిక ప్రకారం.. 61 ఏళ్ల షీలా ఆమె ఆగష్టు 14, 2019న టెలిఫోన్ అపాయింట్‌మెంట్ ఇచ్చిందని, ఆమె విసుగుగా, కొన్నిసార్లు ఊపిరి గట్టిగా పీల్చుకున్నట్లు అనిపించిందని తెలిపారు. ఆమె మరుసటి రోజు GP ని కలవవలసి ఉండగా.. అపాయింట్‌మెంట్‌ సమయానికి హాజరుకాలేదు.

ఇదిలా ఉంటే షీలా మృతికి కారణాలు తెలియలేదు. షీలా మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో పోస్టుమార్టంలో ఆమె మరణానికి గల కారణాలను గుర్తించలేకపోయారు నిపుణులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..