AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Alert: వారెవ్వా ఏమన్న ఉద్యోగమా.. నెలకు రూ. 6.5 లక్షల జీతం.. చాకెట్లను రుచి చూడడమే పని..

Job Alert: ఉద్యోగం అంటే ఎనిమిది గంటలు విరామం లేకుండా పని చేయాలి సహజంగా అందరూ ఇదే భావనలో ఉంటారు. అలాకాకుండా ఎంచక్కా చాక్లెట్లను తింటూ గడిపేయడమే ఉద్యోగం పని అయితే ఎలా ఉంటుంది.? ఆ పని చేసినందుకు...

Job Alert: వారెవ్వా ఏమన్న ఉద్యోగమా.. నెలకు రూ. 6.5 లక్షల జీతం.. చాకెట్లను రుచి చూడడమే పని..
Narender Vaitla
|

Updated on: Jul 25, 2022 | 10:36 AM

Share

Job Alert: ఉద్యోగం అంటే ఎనిమిది గంటలు విరామం లేకుండా పని చేయాలి సహజంగా అందరూ ఇదే భావనలో ఉంటారు. అలాకాకుండా ఎంచక్కా చాక్లెట్లను తింటూ గడిపేయడమే ఉద్యోగం పని అయితే ఎలా ఉంటుంది.? ఆ పని చేసినందుకు నెలకు రూ. 6.5 లక్షల జీతం ఇస్తే.. వినడానికి నమ్మకంగా లేదు కదూ! అయితే ఇలాంటి ఉద్యోగం నిజంగానే ఉంది. అమెరికాకు చెందిన ఓ క్యాండీ రిటైలర్‌ తమ సంస్థలో ఓ ఉద్యోగాన్ని భర్తీ చేస్తోంది. ఆ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన యాడ్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ జాబ్‌ ఏంటి.? దీనికి అర్హతలు ఏంటి లాంటి విషయాలపై ఓ లుక్కేయండి..

అమెరికాలోని క్యాండీ ఫన్‌ హౌజ్‌ అనే చాక్లెట్ల కంపెనీ చీఫ్‌ క్యాండీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టుకు ఎంపికైన వారు కాండియాలజిస్టుల బృందాన్ని లీడ్‌ చేయాల్సి ఉంటుంది. కంపెనీలో తయారయ్యే చాక్లెట్లను రుచి చూసి వాటికి రేటింగ్ ఇవ్వడమే ఈ పోస్టుకు ఎంపికైన వారు చేయాల్సిన పని. ఐదేళ్లు పైబడిన వారెవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 100000 డాలర్లను జీతంగా అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 31లోపు కంపెనీలో అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అప్లై చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు అమెరికాలోని టొరంటో లేదా న్యూజెర్సీ నెవార్క్‌లోని క్యాండీ ఫన్‌ హౌస్‌ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://candyfunhouse.ca/pages/careers వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంపెనీ పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!