కాలేజ్‌లో అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. వెల్లువెత్తుతున్న మద్దతు

కాలేజ్‌లో అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. వెల్లువెత్తుతున్న మద్దతు

Phani CH

|

Updated on: Jul 25, 2022 | 9:20 AM

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమే. వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం, కలిసిపోయే తత్వం ఉండటం సహజమే. అయితే తిరువనంతపురంలో ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్ధులు వినూత్న నిరసనకు దిగారు.



ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమే. వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం, కలిసిపోయే తత్వం ఉండటం సహజమే. అయితే తిరువనంతపురంలో ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్ధులు వినూత్న నిరసనకు దిగారు. ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన కొంత మంది విద్యార్ధులు తాము రోజూ కూర్చునే బెంచ్ వద్దకు వెళ్లారు. అక్కడ మూడు సీట్లు కలిసి ఒకే బెంచ్‌లా ఉండే దానికి విడదీసి..దూర దూరంగా సింగిల్‌ సీట్‌ బెంచ్‌లా వేసి ఉండటం చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడాన్ని వ్యతిరేకిస్తూ కాలేజ్‌ యాజయమాన్యం చేసిన ఈ చర్యకు వెంటనే వారు నిరసన తెలిపేందుకు రెడీ అయ్యారు. పక్కపక్కన కూర్చోకుండా చేయడం వల్ల తమలో లింగ బేధం భావన వస్తుందని, ఇది తమ స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని ఆగ్రహంతో ఊగిపోయారు. అబ్బాయిలు బెంచీలపై కూర్చోగా.. అమ్మాయిలు వారి ఒళ్లో కూర్చుని వినూత్న నిరసన తెలిపారు. ఇలాంటి తక్కువ స్థాయి ఆలోచనలు తమ స్నేహాన్ని ఆపలేవని మండిపడ్డారు. ఒకరి పక్కన కూర్చోలేం కానీ కచ్చితంగా ఒడిలో కూర్చోగలమని స్పష్టం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘోర రోడ్డు ప్రమాదం.. తాను చనిపోతూ కూడా బిడ్డకు జన్మనిచ్చింది

Viral Videos: సూపర్ హీరో.. రెప్పపాటులో అమ్మాయిని ఎలా కాపాడాడో చూడండి..

వామ్మో అది టీ స్టాల్‌ కాదు.. లోపలి సీన్‌ చూసి పోలీసులు షాక్‌

Death-Pool: స‌ముద్రం దిగువ‌న మృత‌కొల‌ను !! ఇందులోకి పోయిన జీవి తిరిగిరాదు

TOP 9 ET News: వైరల్‌ గా బన్నీ పుష్ప 2 లుక్‌.. కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్‌

Published on: Jul 25, 2022 09:20 AM