AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: డ్రగ్స్‌కు బానిస అయిన కొడుకు.. విషయం తెలిసిన తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాకే..!

Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. డ్రగ్స్‌కు బానిసైన తన 21 ఏళ్ల కొడుకును ఓ తండ్రి దారుణంగా చంపేశాడు.

Gujarat: డ్రగ్స్‌కు బానిస అయిన కొడుకు.. విషయం తెలిసిన తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాకే..!
Drugs
Shiva Prajapati
|

Updated on: Jul 25, 2022 | 9:39 AM

Share

Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. డ్రగ్స్‌కు బానిసైన తన 21 ఏళ్ల కొడుకును ఓ తండ్రి దారుణంగా చంపేశాడు. హత్య చేసిన తరువాత అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి రెండు చోట్ల పారవేశాడు. అనంతరం అతను నేపాల్‌కు పారిపోతుండగా.. పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్‌లోని వస్నా ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జూలై 20, 21 తేదీలలో చనిపోయిన వ్యక్తి యొక్క శరీర భాగాలను వాస్నా, ఎల్లిస్‌ ప్రాంతాలలో లభ్యమయ్యాయి. వంతెన, చెత్తకుప్పల్లో పడేసిన తల, చేతులు, మొండెం, కాళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే, ఈ శరీర భాగాలు ఎవరవన్న కోణంలో విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. విచారణలో ఆ పార్ట్స్ అన్నీ ఒకే వ్యక్తికి చెందినవని తేల్చారు. సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో మృతుడి తండ్రి నీలేష్ జోషికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఆ మేరకు విచారణ జరుపగా.. అసలు నిజం బయటపడింది.

నిందితుడు తండ్రి నీలేష్ జోషి జూలై 17న రాత్రి తన కొడుకును దారుణంగా హత్య చేశాడు. అతని శరీరాన్ని ముక్కలుగా నరికి నిర్మానుష్య ప్రాంతాల్లో పడేశాడు. అనంతరం నిందితుడు జోషి జూలై 22న అహ్మదాబాద్ నుండి సూరత్‌కు బయలుదేరాడు. అక్కడి నుంచి నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా గోరఖ్‌పూర్‌కి రైలు ఎక్కాడు. అయితే, ఈలోపు హత్యలో జోషి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. రాజస్థాన్‌లోని గంగానగర్ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకీ హత్య ఎందుకు చేశాడంటే.. పోలీసుల విచారణలో నిందితుడు తండ్రి నీలేష్ జోషి తన కొడుకు డ్రగ్స్, మద్యానికి బానిస కావడం వల్లే హత్య చేసినట్లు వెల్లడించాడు. మద్యం, డ్రగ్స్ మత్తులో తండ్రితో తరచూ గొడవపడేవాడు. జులై 18న కూడా అలాగే వేధించాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దాంతో కోపోద్రిక్తుడైన తండ్రి.. రాయితో కొడుకు తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పడేసేందుకు వీలుగా.. ముక్కలు చేశాడు. ప్లాస్టిక్ సంచుల్లో ఆ శరీర భాగాలను పెట్టి బైక్‌పై తీసుకెళ్లి పడేశాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..