Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pit Bull Dog: యజమాని ప్రాణాలు తీసిన పెంపుడు శునకం.. అయినా దత్తత తీసుకుంటామంటున్న జంతు ప్రియులు

ఇటీవల ఓ పెంపుడు శునకం.. యజమానిని చంపిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది భయంతో పెంపుడు శునకాలను రోడ్లపై వదిలేస్తున్నారు.

Pit Bull Dog: యజమాని ప్రాణాలు తీసిన పెంపుడు శునకం.. అయినా దత్తత తీసుకుంటామంటున్న జంతు ప్రియులు
Pit Bull Dog
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2022 | 12:37 PM

Pit Bull Dog: జంతువులను కాపాడేందుకు జంతుప్రేమికులు అనునిత్యం పాటుపడుతుంటారు. జంతువులు దాడి చేసినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వాటికి ఆహారం అందిస్తూ మానవత్వం బతికే ఉంది అని నిరూపిస్తుంటారు. ఇటీవల ఓ పెంపుడు శునకం.. యజమానిని చంపిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది భయంతో పెంపుడు శునకాలను రోడ్లపై వదిలేస్తున్నారు. ఈ క్రమంలో ఆ కుక్కను తమకు అప్పగిస్తే ఆలనా.. పాలనా చూసుకుంటామని జంతు ప్రేమికులు.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మానవత్వం బతికే ఉందని నిరూపిస్తు్న్నాయి. యూపీ లక్నోలో వృద్ధురాలిని చంపిన పిట్‌బుల్‌ డాగ్‌ను దత్తత తీసుకోవడానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కానీ ఆమె కుమారుడిని సంప్రదించలేదని పేర్కొన్నారు. కైసర్‌బాగ్‌లోని బెంగాలీ తోలాలో నివాసముంటున్న అమిత్ మిశ్రా పెంపుడు కుక్క పిట్‌బుల్.. జూలై 12న అతని తల్లిని చంపింది. జూలై 14న మున్సిపల్ కార్పొరేషన్ బృందం కుక్కను పట్టుకుని జర్హారలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి పిట్‌బుల్ ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో పిట్‌బుల్ కుక్కను దత్తత తీసుకోవడానికి 8 స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా మరికొంతమంది పిట్‌బుల్ డాగ్‌ను అప్పగిస్తే ఆలనా పాలనా చూసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు.

వృద్ధురాలి కుమారుడు కైసర్‌బాగ్ ప్రాంతంలో జిమ్ ట్రైనర్.. అతను రెండు పెంపుడు కుక్కలను పిట్‌బుల్, లాబ్రడార్‌ లను పెంచుకునే వాడు. మహిళపై దాడి చేసిన బ్రౌనీ అనే కుక్కను మూడేళ్ల క్రితం ఇంటికి తీసుకొచ్చినట్లు అమిత్ తెలిపాడు. ప్రస్తుతం లక్నో మునిసిపల్ కార్పొరేషన్ (LMC) ఆధ్వర్యంలో కుక్కను ఉంచి.. దాని ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. ప్యానెల్‌లోని నలుగురు సభ్యుల పర్యవేక్షణలో ఉంది. అయితే.. ఆ కుక్కను దత్తత తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ఈ క్రమంలో పిట్‌బుల్‌ను దాని యజమాని అమిత్‌కు తిరిగి ఇవ్వాలని మేనకా గాంధీ అధికారులను కోరగా.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

మునిసిపల్ కార్పొరేషన్ జంతు సంరక్షణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ రావు మాట్లాడుతూ.. పిట్‌బుల్‌ను దాని యజమాని అమిత్‌కు ఇవ్వాలంటూ మేనకా గాంధీ ఫోన్‌లో చూసించారని.. కానీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పామని పేర్కొన్నారు. ఈ విషయంపై యజమానితో మాట్లాడాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి