Viral Video: పెళ్లి బరాత్‌లో వింత డ్యాన్స్.. గుర్రంతో మజాక్.. కట్‌చేస్తే దెబ్బకు ఫ్యూజులౌట్..

సాధారణంగా వివాహ వేడుక సందడి సందడిగా జరుగుతుంది. వధూవరులతోపాటు కుటుంబసభ్యులంతా ఆనందంలో మునిగిపోతారు. అయితే.. ఈ వివాహ వేడుకల్లో కొంతమంది

Viral Video: పెళ్లి బరాత్‌లో వింత డ్యాన్స్.. గుర్రంతో మజాక్.. కట్‌చేస్తే దెబ్బకు ఫ్యూజులౌట్..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2022 | 11:16 AM

Wedding Funny video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఇవి కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ వివాహానికి సంబంధించిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సాధారణంగా వివాహ వేడుక సందడి సందడిగా జరుగుతుంది. వధూవరులతోపాటు కుటుంబసభ్యులంతా ఆనందంలో మునిగిపోతారు. అయితే.. ఈ వివాహ వేడుకల్లో కొంతమంది డ్యాన్స్ టాలెంట్ కూడా తెరపైకి వస్తుంది. విచిత్రమైన నృత్యంతో వారు అందరినీ అలరిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో జరిగే కొన్ని సన్నివేశాలు అందరినీ తెగ నవ్విస్తాయి. ఈ వీడియో కూడా అందరినీ నవ్వించడంతోపాటు తెగ ఆకట్టుకుంటోంది.

ఈ వైరల్ వీడియోలో పెళ్లి బరాత్‌లో ఓ వ్యక్తి డాన్స్ వేయడాన్ని చూడవచ్చు. ఊరేగింపులో ఒక వ్యక్తి.. గుర్రాలకు దగ్గరగా డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ కనిపించాడు. ఈ సమయంలో అతని వింత స్టెప్పులు చూసి ఓ గుర్రానికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో అది కాళ్లతో తన్నింది. ఇంకేముంది అతను ఎగురుకుంటూ వెళ్లి కిందపడ్డాడు. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ తెగ నవ్వుకుంటున్నారు. గుర్రాలను ఆటపట్టిస్తే ఊరుకుంటాయా..? ఇలానే సమాధానం చెబుతాయంటూ పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

వాస్తవానికి జంతువుల దగ్గర అతిచేస్తే అవి అస్సలు ఊరుకోవు. అందుకే ఘాటుగా స్పందిస్తాయని పేర్కొంటున్నారు. గుర్రం దాడి చేయడంతో అతనికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో iam_a_dreamer_5 అనే యూజర్ షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించి పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..