Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో ఆగస్టు, సెప్టెంబర్‌లో 16 ప్రత్యేక రైళ్లు..
Special Trains: విశాఖపట్నం - బెంగుళూరు, బెంగుళూరు - విశాఖపట్నం (Visakhapatnam – Bengaluru – Visakhapatnam) మధ్య 16 వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

Special Trains: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల మధ్య భారత రైల్వే(Indian Railways) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. విశాఖపట్నం – బెంగుళూరు, బెంగుళూరు – విశాఖపట్నం (Visakhapatnam – Bengaluru – Visakhapatnam) మధ్య 16 వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక రైలు నెం.08543 ఆగస్టు 7, 14,21,28, సెప్టెంబర్ 4,11,18,25 తేదీల్లో మధ్యాహ్నం 03.55 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.00 గం.లకు SMVT బెంగుళూరుకు చేరుకుంటుంది. అలాగే ఎదురు దిశలో ప్రత్యేక రైలు నెం. 08544 ఆగస్టు 8,15,22,29, సెప్టెంబర్ 5,12,19,26 తేదీల్లో మధ్యాహ్నం 03.50 గంటలకు SMVT బెంగుళూరు నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 11.00 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, బంగార్‌పేట్, కృష్ణరాజపురం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు..





16 Weekly Special Trains between Visakhapatnam – Bengaluru – Visakhapatnam
నాందేడ్ – కాజీపేట్ ప్రత్యేక రైలు..
ఇదిలా ఉండగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా నాందేడ్ నుంచి కాజీపేట్‌కు రైల్వే శాఖ సోమవారం (జులై 25)నాడు ఓ ప్రతేక రైలును నడపనుంది. ఈ ప్రత్యేక రైలు 07489 సోమవారం రాత్రి 08.35 గం.లకు నాందేడ్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 07.00 గం.లకు కాజీపేట్ చేరుకుంటుంది.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..