Viral: అడవిలో కాలిపోతున్న మృతదేహాన్ని చూసిన గొర్రెల కాపరులు.. ఆరా తీయగా పోలీసుల మైండ్ బ్లాంక్!
నిర్మానుష్యమైన అడవిలో ఓ మృతదేహం కాలుతుండగా.. కొందరు గొర్రెల కాపరులు దాన్ని చూశారు. భయపడి వెంటనే..
నిర్మానుష్యమైన అడవిలో ఓ మృతదేహం కాలుతుండగా.. కొందరు గొర్రెల కాపరులు దాన్ని చూశారు. భయపడి వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. స్పాట్‌కు చేరుకున్న ఖాకీలు.. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా మృతుడు ఎవరన్నది తెలుసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా.. స్టన్నింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఇంతకీ అసలు కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని మంగ్లియా గ్రామ శివార్లలోని అడవిలో సగం కాలిన ఓ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. అంతేకాదు ఆ అడవికి దగ్గరలో ఉన్న ఓ కాలువలో బైక్ దొరకింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడి వివరాలు తెలుసుకునేందుకు శవానికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. మృతుడు కట్కట్ ఖేడీ గ్రామానికి చెందిన హన్స్‌రాజ్ చౌహాన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. స్టన్నింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసుపై ఎస్పీ భగవత్ సింగ్ విర్డే మాట్లాడుతూ.. ”మృతుడు కట్కట్ ఖేడీ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఎప్పుడూ ఫోన్ చేసి మాట్లాడేవాడు. అనంతరం కొద్దిరోజులకు వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇక భార్యకు తరచూ ఫోన్లు వస్తుండటంతో అనుమానమొచ్చి భర్త ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. చౌహాన్‌ను ఎలాగైనా అడ్డు తప్పించాలని నిర్ణయించుకున్న ఆ మహిళ భర్త తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ రచించాడు. చౌహాన్ హత్య చేసి.. మృతదేహాన్ని అడవిలో తగలబెట్టాడు. కాగా, ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు.