Viral: కండోమ్‌లను ఎగబడి కొంటున్న కుర్రాళ్లు.. శృంగారానికి కాదండోయ్.. రీజన్ తెలిస్తే మైండ్ బ్లాంకే!

ఇక్కడ కొంతమంది కుర్రాళ్లు కండోమ్స్‌ను ఎగబడి కొంటున్నారు. ఏముంటుందిలే.! అందుకే అయ్యి ఉంటుందని అని అనుకోకండి..

Viral: కండోమ్‌లను ఎగబడి కొంటున్న కుర్రాళ్లు.. శృంగారానికి కాదండోయ్.. రీజన్ తెలిస్తే మైండ్ బ్లాంకే!
Condoms
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 26, 2022 | 8:26 PM

కండోమ్స్.. అవాంఛిత గర్భధారణ, ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన రోగాలు రాకుండా ఉండేందుకు కొందరు వీటిని ఉపయోగిస్తుంటారు. అలాగే పెళ్లి తర్వాత కొద్దికాలం పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మరికొందరు కండోమ్స్ వాడుతుంటారు. కొన్ని దేశాల్లోని ప్రభుత్వాలు అయితే.. ఉచితంగానే ప్రజలకు కండోమ్స్‌ను పంచిపెడుతుంటారు. సరే ఇవన్నీ పక్కనపెడితే.. ఇక్కడ కొంతమంది కుర్రాళ్లు కండోమ్స్‌ను ఎగబడి కొంటున్నారు. ఏముంటుందిలే.! అందుకే అయ్యి ఉంటుందని అని అనుకోకండి.. శృంగారానికి మాత్రం అస్సలు కాదండోయ్.. మరి ఎందుకు అనుకుంటున్నారు.? ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.!

వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ బెంగాల్‌లోని దుర్గాపూర్ చుట్టుప్రక్కల మెడికల్‌ స్టోర్స్‌లో.. స్థానికంగా ఉండే కుర్రాళ్లు పెద్ద ఎత్తున కండోమ్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిని కొనేది శృంగారానికి కాదంట.. ఆ కొన్న కండోమ్స్‌ అన్నింటినీ రాత్రంతా వేడి నీటిలో నానబెడుతున్నారు. అనంతరం కండోమ్స్ బయటపారేసి.. ఆ నీటిని తాగుతూ.. మందుబాబుల్లా తూలుతున్నారు. ఇప్పుడు ఇదే విషయం అక్కడ స్థానికంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. అదేంటి ఇలా.? వాళ్లు చేసే పని మీకు ఆశ్చర్యాన్ని కలిగించింది కదూ.! వెయిట్ గయ్స్..

ఈ అంశంపై దుర్గాపూర్ ఆర్ఈ కాలేజీ మోడల్ స్కూల్ కెమిస్ట్రీ టీచర్ నురుల్ హక్(Nurul Haque) స్పందించారు. “కండోమ్స్‌ను వేడి నీటిలో ఎక్కువ సేపు నానబెడితే.. పెద్ద ఆర్గానిక్ మాలిక్యుల్స్ బద్దలయ్యి.. ఆల్కాహాలిక్‌ కాంపౌండ్స్‌గా మారతాయి. తద్వారా ఆ నీటికి ఆల్కాహాలిక్‌ స్వభావం వస్తుంది” కాగా, ఈ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ బాగానే ఉంది గానీ.. ఇలాంటి వాటికి కాలేజీ స్టూడెంట్స్, యూత్ ఎక్కువగా బానిసులు అవుతుండటంతో స్థానిక అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.(Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.